Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం యోగిని కలవాలంటే.. సబ్బుతో స్నానం చేసి పౌడర్ - సెంటు పూసుకోవాలి!

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్... బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైనశైలిలో పాలన సాగిస్తూ ముందుకు వెళుతున్నారు. గత ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా పాలించడమే కాకుండా,

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (15:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్... బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైనశైలిలో పాలన సాగిస్తూ ముందుకు వెళుతున్నారు. గత ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా పాలించడమే కాకుండా, ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నా. అనేక కీలక, కఠిన నిర్ణయాలు తీసుకుని వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, సీఎం యోగి ఆదిథ్యనాథ్‌ను దళితులు కలవాలంటే సబ్బులు, షాంపులతో స్నానం చేసి పౌడర్, సెంటు రాసుకోవాలని అపుడే సీఎంను కలిసేందుకు అనుమతిస్తామని ఆ రాష్ట్ర అధికారులు చెప్పడం కాస్త విడ్డూరంగా ఉంది. దీన్ని నమ్మలేకపోతున్నా ఇది ముమ్మాటికీ నిజం.
 
గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముషార్ దళితవాడకు సీఎం యోగి వస్తున్నారంటూ... అక్కడున్న దళితులకు కుషాయినగర్ జిల్లా అధికారులు సబ్బులు, షాంపూలు, సెంటులు, పౌడర్లు పంపిణీ చేశారట. ముఖ్యమంత్రిని కలవాలంటే స్నానం చేసి, సెంటు, పౌడరు పూసుకోవాలని అధికారులు ఆదేశించారట.
 
ఈ సందర్భంగా ఓ దళిత నాయకుడు మాట్లాడుతూ, సీఎంను కలవడానికి తాము స్నానం చేసి సెంటు పూసుకొని వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు. అయితే, యోగి వచ్చినందుకు కొత్తగా మరుగుదొడ్లు నిర్మించారని, రోడ్లకు మరమ్మతులు చేశారని, వీధి దీపాలు కూడా అమర్చారని దళితవాడ వాసులు చెప్పారు. ఏది ఏమైతేనేంగానీ సీఎం పుణ్యమాని తమ వాడకు కొత్త వెలుగు వచ్చిందని దళితులు చెప్పడం కొసమెరుపు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments