Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఆపిల్ వుంది.. అయినా తినలేరు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యానికి అధినేత.. అయితే ఆయన చేతికందింది.. నోటికి అందలేదు. ఏంటది? అనుకుంటున్నారు.. కదూ.. అదేనండి ఆపిల్ స్మార్ట్ ఫోన్. రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని వ్యాపారవేత

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (15:16 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యానికి అధినేత.. అయితే ఆయన చేతికందింది.. నోటికి అందలేదు. ఏంటది? అనుకుంటున్నారు.. కదూ.. అదేనండి ఆపిల్ స్మార్ట్ ఫోన్. రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని వ్యాపారవేత్తగా రాణించిన ట్రంప్.. వైట్‌హౌస్‌లో అడుగుపెట్టకముందు... సోషల్ మీడియాను తెగ వాడుకున్నారు. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక భద్రతా కారణాల రీత్యా ప్రస్తుతం ఆయన చేతిలో సెల్ ఫోన్‌ కేవలం హల్లో చెప్పడానికే పనికొస్తుందట.
 
హలో చెప్పడం.. గేమ్స్ ఆడుకోవడానికి తప్పనిస్తే.. అత్యాధునిక ఫీచర్లున్న ఆపిల్ ఐఫోన్‌లో ఎలాంటి యాప్‌లకు అవకాశం ఇవ్వట్లేదని సమాచారం. కానీ ట్రంప్ మాత్రం ట్విట్టర్ తన ఐఫోన్‌లో వుండాలని కోరారని తెలుస్తోంది. ఆయన విజ్ఞప్తి మేరకు ట్విట్టర్‌ను మాత్రం యాక్టివేట్ చేసినట్లు సమాచారం. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రచారం కోసం ట్విట్టర్‌ను తెగ వాడుకున్న ట్రంప్.. అధికారంలోకి వచ్చాక ట్విట్టర్ ద్వారానే గెలిచానని గొప్పగా చెప్పుకున్నారు. అయితే ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు ఇవాన్ విలియమ్స్ మాత్రం ట్రంప్ అధ్యక్షుడు అయ్యేందుకు ఒకవేళ ట్విట్టర్ సాయపడి వుంటే అందుకు తాను క్షమాపణలు చెప్తున్నానని వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments