Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ఉద్యోగం కోసం ఫారిన్ వెళితే.. ప్రియుడితో ఉడాయించిన నవవధువు

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన భర్తకు ఓ నవవధువు తేరుకోలేని విధంగా షాకిచ్చింది. భర్త అటు విమానం ఎక్కాడో లేదో.. భార్య ఇలా ప్రియుడిని తీసుకుని ఉడాయించింది.

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (09:36 IST)
ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన భర్తకు ఓ నవవధువు తేరుకోలేని విధంగా షాకిచ్చింది. భర్త అటు విమానం ఎక్కాడో లేదో.. భార్య ఇలా ప్రియుడిని తీసుకుని ఉడాయించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నావ్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉన్నావ్ పరిధిలోని సరాయా గ్రామంలో ఇటీవల అమర్ సింగ్ అనే వ్యక్తికి సునీత అనే యువతితో గత మార్చి నెల పదో తేదీన వివాహం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారు. అయితే, అమర్ సింగ్ అప్పటికే విదేశాల్లో పని చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆయనకు సెలవులు ముగియడంతో తిరిగి విధుల్లో చేరేందుకు భార్యను ఇంటిపట్టునే వదిలి రెండు నెలలకే విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో భార్య తన ప్రేమికుడిని ఇంటికి పిలిపించుకుని, ఇంటిలోని నగలతోపాటు, రూ.20 వేల నగదు తీసుకుని మరీ ఉడాయించింది.
 
దీనిపై అమర్ సింగ్ సోదరుడు సందీప్ మాట్లాడుతూ మా అన్నయ్య అమర్ సింగ్‌కు 2017 మార్చి10న సునీతతో వివాహం జరిగింది. అన్నయ్య విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే పెళ్లయిన తర్వాత విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో దుర్గా యాదవ్ అనే యువకుడు సునీతను కలిసేందుకు ఇంటికి వచ్చాడు. ఈ విషయమై సునీతను ప్రశ్నించగా తమ సమీప బంధువు అని చెప్పింది. ఈ క్రమంలో అన్నయ్య విదేశాలకు వెళ్లగానే వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments