Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం.. కరోనా వ్యాక్సిన్‌కు బదులు రాబిస్ టీకా వేశారు..

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (18:48 IST)
యూపీలోని ఓ హెల్త్ సెంటర్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెళ్లిన ముగ్గురు మహిళలకు.. అక్కడి హెల్త్ సెంటర్ సిబ్బంది రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం కలకలం రేపింది. రాబిస్ టీకా తీసుకున్న ముగ్గురిలో ఒకరు అనారోగ్యం పాలవడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ షామ్లీ జిల్లాలోని కంధాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సరోజ్ (70), అనార్కలి (72), సత్యవతి (60) అనే ముగ్గురు మహిళలు కలిసి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకునేందుకు ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. వెంటనే అక్కడి వైద్య సిబ్బంది ఒక్కొక్కరితో రూ. 10 సిరంజిలు కొనిపించారు. అనంతరం వారికి కరోనా వ్యాక్సిన్ బదులు రేబిస్ టీకాలు వేసి పంపించారు.
 
అయితే.. టీకా వేయించుకుని ఇంటికి వెళ్లిన సరోజ్‌కు మత్తుగా, అసౌకర్యంగా ఉన్నట్టు అనిపించింది. ఆమె అదో రకంగా ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యుడు ఆమెకు రేబిస్ టీకా వేసినట్టు గుర్తించాడు. దీంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ వేసిన సిబ్బందిపై మండిపడ్డారు. 
 
మరీ ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం ఏంటని సిబ్బందిని నిలదీశారు. ఈ విషయమై షామ్లీ సీఎంవో సంజయ్ అగర్వాల్‌కు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. నిర్లక్ష్యంగా వ్యహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments