Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీనేజ్ కుమార్తెపై అత్యాచారం.. కిరాతక తండ్రికి 1503 యేళ్ల జైలుశిక్ష... అమెరికా కోర్టు తీర్పు

టీనేజ్ కుమార్తెపై ఏకంగా నాలుగేళ్ళ పాటు అత్యాచారం చేస్తూ వచ్చిన కిరాతక తండ్రికి 1503 యేళ్ళ పాటు జైలుశిక్ష విధిస్తూ అమెరికా కోర్టు ఒకటి సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది.

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2016 (10:07 IST)
టీనేజ్ కుమార్తెపై ఏకంగా నాలుగేళ్ళ పాటు అత్యాచారం చేస్తూ వచ్చిన కిరాతక తండ్రికి 1503 యేళ్ళ పాటు జైలుశిక్ష విధిస్తూ అమెరికా కోర్టు ఒకటి సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. అయితే, తీర్పు వెలువరించే సమయంలో ముద్దాయి (కిరాత తండ్రి) పేరును ఎక్కడా వెల్లడించలేదు. తండ్రి పేరును వెల్లడించడం వల్ల బాధితురాలిని సులభంగా గుర్తుపట్టే అవకాశం ఉన్నందుకు దోషి పేరును వెల్లడించడం లేదని పేర్కొంది. శనివారం వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే...
 
కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోకు చెందిన 41 ఏళ్ల తండ్రి తన కుమార్తెపై అత్యంత పాశవికంగా నాలుగేళ్లపాటు అత్యాచారం చేస్తూ వచ్చాడు. చివరకి ఈ విషయం బహిర్గతం కావడంతో అతనిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ ప్రెస్నో కోర్టులో సాగింది. ఈ కేసులో తుది తీర్పును శనివారం వెల్లడైంది. 
 
'తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడినప్పుడు నేను యుక్తవయసులో ఉన్నా. అతడిని అడ్డుకునే శక్తి కానీ, నన్ను నేను రక్షించుకునే అవకాశం కానీ లేకుండా పోయాయి' అని బాధితురాలు పేర్కొంది. ప్రస్తుతం ఆమె వయసు 23 ఏళ్లు. తండ్రి తనపై ఎప్పుడూ జాలి చూపలేదని ఆమె జడ్జికి తెలిపింది. కేసును పూర్తిగా విచారించిన న్యాయస్థానం దోషికి 1,503 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఇటువంటి వ్యక్తుల వల్ల సమాజానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని జడ్జి ఎడ్వర్డ్ సర్కిసియాన్ జూనియర్ తన తీర్పులో పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒత్తిడిని తట్టుకోలేక అధిక మాత్రలు తీసుకుంది : కల్పన కుమార్తె (Video)

RC 16: హైదరాబాద్ షూట్ లో రామ్ చరణ్ RC 16 చిత్రంలో శివ రాజ్‌కుమార్ ఎంట్రీ

కుమార్తెతో గొడవపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సింగర్ కల్పన!

మిల్క్ బ్యూటీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఏంటది?

నిద్రమాత్రలు మింగిన గాయని కల్పన ఆరోగ్యం ఎలావుంది? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

తర్వాతి కథనం
Show comments