Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ గున్యా వ్యాప్తికి వ్యాక్సిన్‌తో చెక్.. కొత్తగా ఆవిష్కరణ

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (14:34 IST)
చికెన్ గున్యా జ్వరానికి వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. యూరప్‌కు చెందిన వాల్నేవా అనే కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అయితే, ఈ టీకా వాడేందుకు అమెరికా ఆరోగ్య సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఆమోదముద్ర వేసింది. దోమల ద్వారా వ్యాపించే చికెన్ గున్యా వైరస్‌ను ఈ టీకా ద్వారా అడ్డుకోవచ్చని ఎఫ్.డి.ఏ అధికారులు తెలిపారు. 
 
18 యేళఅలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు దీనిని వినియోగించవచ్చు. ఇక ఈ వైరస్ ప్రభావం ఉన్న దేశాలలో ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని వైద్యులు తెలిపారు. లిక్స్ చిక్స్ అనే పేరుతో ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో విక్రయించనున్నారు. 
 
 
 
జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు కలిగించే ఈ చికెన్ గున్యా ముఖ్యంగా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. గత 15 యేళ్లలో దాదాపు 5 మిలియన్ల మంది ప్రజలు ఈ వైరస్ బారినపడ్డారు. 
 
అలాగే, ఈ వైరస్ కొత్తగా మరికొన్ని భౌగోళిక ప్రాంతాలకు కూడా వ్యాపించింది. అందుకే దీన్ని ప్రపంచ వ్యాప్త వ్యాధిగా ఎప్.డి.ఏ అధికారులు పేర్కొంటున్నారు. 
 
ఇక క్లినికల్ ప్రయోగాల్లో భాగంగా, నార్త్ అమెరికాలో 3500 మందిపై ఈ వ్యాక్సిన్‌ను పరీక్షించినట్టు వెల్లడించారు. అయితే, ఈ వ్యాక్సిన్‌ను వల్ల తలనొప్పి, అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు, జ్వరం, వికారం వంటి సాధారణ దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments