విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ సాధించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' తర్వాత సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి భారతదేశపు మొట్టమొదటి బయో-సైన్స్ చిత్రం 'ది వ్యాక్సిన్ వార్'తో వస్తున్నారు. ఐ యామ్ బుద్ధా ప్రొడక్షన్స్ పై పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంతకుముందు 'ది కాశ్మీర్ ఫైల్స్' కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ఈ ప్రాజెక్ట్‌కు కూడా అసోషియేషన్ లో వున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ట్రైలర్ ఈ చిత్రం కోర్ పాయింట్ కోవిడ్-19, వ్యాక్సిన్ డ్రిల్ల్స్ గురించి కొన్ని అధ్యాయాలను ఆసక్తిరేకెత్తించేలా ప్రజంట్ చేసింది. వైరస్‌కు వ్యాక్సిన్‌ను రూపొందించే ఛాలెంజ్‌ని స్వీకరించిన సైంటిస్ట్ హెడ్ నానా పటేకర్‌తో వీడియో ప్రారంభమవుతుంది. దేశ భద్రత దృష్ట్యా ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచాలని ఆయన ఉన్నతాధికారులను కోరుతారు. దేశవాళీ వ్యాక్సిన్‌పై ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా నో, వ్యాక్సిన్‌ను రూపొందించడంలో భారతదేశం విజయవంతం కాలేదు అని ఓ జర్నలిస్ట్ వ్యాఖ్యానించే సన్నివేశం ట్రైలర్ వుంది. జర్నలిస్ట్ పాత్రని రైమా సేన్ పోషించారు.
ట్రైలర్ అంతా యంగేజింగ్ గా వుంది. ప్రతి సన్నివేశం ఆసక్తిని రేపింది. ఈ చిత్రంలో నానా పటేకర్, అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ, పరితోష్ సాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్ తదితరులు నటిస్తున్నారు.
'వ్యాక్సిన్ వార్' హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీలతో సహా 10+ భాషల్లో సెప్టెంబర్ 28న విడుదల కానుంది.