నవజాత శిశువును ఫ్రీజర్‌లో పెట్టి మరిచిపోయిన తల్లి.. ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 8 సెప్టెంబరు 2025 (17:56 IST)
ఓ మహిళ నవజాత శిశువును ఫ్రీజర్‌లో పెట్టి మరిచిపోయింది. ప్రసవానంతరం తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆ మహిళ మతిమరుపు కారణంగా తన బిడ్డను మర్చిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శుక్రవారం రాత్రి చిన్నారిని నిద్రపుచ్చిన అనంతరం తల్లి ఆమెను ఫ్రిజ్‌లో ఉంచి మర్చిపోయింది. కొంతసేపటికి చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్న శబ్దం విన్న కుటుంబ సభ్యులు ఇల్లంతా వెతికినా ఆ చిన్నారి కనిపించలేదు. చివరకు రిఫ్రజిరేటర్‌లో అపస్మారక స్థితిలో శిశువును గుర్తించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సదరు మహిళ ప్రసవానంతరం మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments