నా కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిల

ఠాగూర్
సోమవారం, 8 సెప్టెంబరు 2025 (17:21 IST)
తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని ఆయన తల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఈ నెల 2వ తేదీన ఆమె తండ్రి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్థంతి వేడుకలను పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించారు. 
 
అలాగే, సోమవారం తన తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి కర్నూలు పర్యటనకు వెళ్లారు. పర్యటనకు ముందు హైదరాబాద్ నివాసంలో అమ్మమ్మ విజయలక్ష్మి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కర్నూలు చేరుకుని, ఉల్లి మార్కెట్‌లో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ షర్మిల తన కుమారుడు రాజకీయ అరంగేట్రంపై అధికారిక ప్రకటన చేశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని ఆమె స్పష్టం చేశారు. సరైన సమయం వచ్చినపుడు రాజారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెడతాడని ఆమె ప్రకరటించారు. ఈ ప్రకటన ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. కాగా, ఈ కర్నూలు పర్యటనలో రాజారెడ్డి తన తల్లి పక్కనే కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments