Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

ఠాగూర్
సోమవారం, 16 జూన్ 2025 (15:29 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతికి తుపాకీతో గురిపెట్టింది. కారు నుంచి దిగమని కోరినందుకు ఆగ్రహించిన ఆ యువతి ఈ దౌర్జన్యానికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని హర్దోయ్ జిల్లాలోని పెట్రోల్ బంకులో ఓ ఉద్యోగి పనిచేస్తున్నాడు. ఈ బంకుకు ఓ కారు వచ్చి సీఎన్జీ గ్యాస్ నింపాలని కోరారు. అయితే, గ్యాస్ ఫిల్ చేసే సమయంలో కారులోని వారు కిందకు దిగాలని సిబ్బంది కోరాడు. దీనికి నిరాకరించడంతో వారి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. 
 
షాబాద్ ప్రాంతానికి చెందిన ఎహ్సాన్ ఖాన్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిల్ గ్రామ్ కొత్వాలి ప్రాంతంలోని సాండి రోడ్డులోని పెట్రోల్ పంపునకు తన కుమార్తె సురీష్ ఖాన్ అలియాస్ అరిబా, భార్య హోస్న్ బానోతో కలిసి వచ్చారు. అయితే, సీఎన్జీ గ్యాస్ నింపుతుండగా వారిని కారు నుంచి కిందకు దిగమనడమే పెట్రోల్ బంకు సిబ్బంది రజనీష్ కుమార్ చేసిన తప్పు. 
 
అయితే కారులోని వారు కిందకు దిగకపోవడంతో కారులో సీఎన్జీ నింపడానికి నిరాకరించాడు. దీంతో వారి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఉద్యోగితో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఓ యువతి... కారులోని తుపాకీ తీసుకుని ఆ ఉద్యోగి ఛాతిపై గురిపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెట్రోల్ బంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆ యువతిని అరెస్టు చేశారు. అలాగే, లైసెన్స్ తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments