గేదెలు కొనుగోలు చేసేందుకు రెండో పెళ్ళికి సిద్ధమైన మహిళ... అత్తామామలు రావడంతో...

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (13:19 IST)
గేదెలు కొనుగోలు చేసేందుకు ఓ మహిళ రెండో పెళ్ళికి సిద్ధమైంది. మరికొన్ని క్షణాల్లో పెళ్ళి జరుగుతుందనగా అత్తామామలు వచ్చారు. దీంతో ఆ మహిళ షాకైంది. పెళ్ళి ఆగిపోయింది. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని హాసన్ పూర్‌కు చెందిన ఆస్మా అనే మహిళ మూడేళ్ల క్రితం నూర్ మహ్మద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, భర్తతో మనస్పర్థలు రావడంతో ఆరు నెలల క్రితం విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇంతలోనే మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న నూర్ మహ్మద్ తల్లిదండ్రులు, పెళ్ళి సర్టిఫికేట్ తీసుకుని వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. 
 
దానిని పరిశీలించిన తర్వాత నిర్వాహకులు పోలీసులను పిలిపించి ఆస్మా, ఆమెకు కాబోయే భర్తపై ఫిర్యాదు చేశారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావని ప్రశ్నించగా, ఇది కేవలం ఓ నాటకమని, పెళ్ళి జరిగిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే డబ్బును చెరిసంగ పంచుకునేలా ఒప్పందం చేసుకున్నామని ఆస్మా వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments