Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోను - టీ కోసం గొడవ - కత్తెరతో భర్త కంట్లో పొడిచిన భార్య... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2023 (10:42 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్‌లో ఓ దారుణం జరిగింది. ఫోను, తేనీరు కోసం భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో కోపోద్రిక్తురాలైన భార్య ... కత్తెరతో భర్త కంట్లో పొడిచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
బాగ్‌పత్ ప్రాంతానికి చెందిన అకింత్, ప్రియాంక అనే దంపతులు ఉన్నారు. యూట్యూబ్‌లో పాటలు చూసేందుకు మొబైల్ ఫోన్ ఇవ్వాలని భర్తను భార్య ప్రియాంక కోరింది. అందుకు ఆమె నిరాకరించింది. నీ వద్ద ఉన్న ఫోనులోనే చూడాలని చెప్పింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇది చిలికి చిలికి గాలివానలామారింది. 
 
ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రియాంక.. భర్తపై దాడి చేసింది. అక్కడే ఉన్న కత్తెరను తీసుకుని భర్త కంటిలో పొడిచింది. దీంతో అతని కన్నుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం అంకిత్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు ఎపుడంటే.. 
 
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో భాగంగా, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, ప్రాక్టికల్స్ మాత్రం రెండు సెషన్లలో ఉంటాయని ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. 
 
కాగా, ఇంటర్ జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్స్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. రెండో శనివారం, ఆదివారాల్లో కూడా ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని బోర్డు అధికారులు వెల్లడించారు. అలాగే, ఇంటర్ మొదటి సంవత్సరంర విద్యార్థులకు మాత్రం ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16వ తేదీ ఉంటుందని తెలిపారు. 
 
మాకొద్దీ ఈ సంబరాల రాంబాబు... అంబటి రాంబాబుకు అసమ్మతి సెగ...  
 
ఏపీ జలవనరుల శాఖామంత్రి, వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబుకు అసమ్మతి సెగ తగిలింది. మాకొద్దీ సంబరాలు రాంబాబు అంటూ వైకాపా నేతలు తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూకట్టారు. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు దాదాపు వంద మంది వరకు గురువారం ఉదయం తాడేపల్లికి వెళ్లి అధిష్టానానికి తమ నిరసన గళం వినిపించారు. ఎంపీ, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. 
 
అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వొద్దంటూ వారు విజ్ఞప్తి చేశారు. సంబరాల రాంబాబుకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని, మరొకరికి ఇస్తే మాత్రం విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఇలా తమ నిరసన గళాన్ని వినిపించిన వారిలో విజయకుమారి కోటిరెడ్డి, అలేఖ్య కృపాకరరావు, సయ్యద్ సీమారఫి, రమేష్ రెడ్డి, రోశిరెడ్డి, మహేంద్ర, భూలక్ష్మి విజయకుమార్, అనిల్ కుమార్, వెంకట కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. 
 
ఆ తర్వాత వారంతా సంయుక్తంగా విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసిన వారిని రాంబాబు పక్కకు నెట్టేశారు. పార్టీని సర్వనాశనం చేశారు. బ్రోకర్లను పెట్టుకుని దోచుకుంటున్నారు. గ్రామాల్లో పార్టీ రెడు గ్రూపులుగా మారిపోయేందుకు అంబటి రాంబాబు కారకులయ్యారు. సంబరాల రాంబాబు మాకొద్దు.. అంబటి రాంబాబు అస్సలు వద్దనే వద్దు అంటూ నినాదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments