Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన రెండు వారాలకే ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

ఠాగూర్
మంగళవారం, 25 మార్చి 2025 (10:50 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఔరియా జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లయిన రెండు వారాలకే భర్తను అంతమొందించేందుకు ప్రియుడుతో కలిసి హత్య చేసింది. పోలీసుల కథనం మేరకు... నిందితులు ప్రగతి యాదవ్ (52), అనురాగ్ యాదవ్ ఇద్దరూ నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే, వీరి పెళ్లికి ప్రగతి తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన దిలీప్‌తో ప్రగతి బలవంతంగా వివాహం జరిపించారు. 
 
ఈ నెల 9వ దిలీప్ బుల్లెట్ గాయాలతో ఓ పొలంలో పడి ఉండగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మరో మూడు ఆస్పత్రులకు తరలించారు. చివరకి ఔరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 20వ తేదీన మృతి చెందాడు. 
 
మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. బాధితుడు భార్య, ఆమె ప్రియుడు కలిసి దిలీప్ హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది. వివాహం తర్వాత ఇద్దరూ కలుసుకునేందుకు వీలుపడకపోవడంతో దిలీప్‌ను హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా, కాంట్రాక్ట్ కిల్లర్ రామాజీ చౌదరీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం రూ.2 లక్షలు చెల్లించారు. 
 
రామాజీ మరికొందరితో కలిసి బైకుపై దిలీప్‌ను పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ దిలీప్‌పై దాడి చేశారు. ఆ తర్వాత తుపాకీ కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారి నుంచి రెండు తుపాకులు, నాలుగు లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక పర్స్, ఆధార్ కార్డు, రూ.3 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం పోలీసులకు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments