Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ వయసు 20 యేళ్లు ఉండటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయ్...

ఠాగూర్
మంగళవారం, 25 మార్చి 2025 (10:26 IST)
ఆడపిల్లల వివాహ వయసు 20 యేళ్ళు ఉండటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని నేపాల్ ప్రభుత్వం అంటోంది. అందుకే ఆడపిల్లల వివాహ వయసును 20 యేళ్ల నుంచి 18 యేళ్ళకు తగ్గించేందుకు సిద్ధమవుతోంది. వివాహ వయసు 20 యేళ్లుగా ఉండటం వల్ల అత్యాచారాలు పెరగడానికి కారణం అవుతోందని, అందువల్ల నేరాలను అరికట్టేందుకు వీలుగా బాలల చట్టం, క్రిమినల్ కోడ్ సవరించాలని నిర్ణయించినట్టు తెలిపింది. 
 
ప్రస్తుతం వివాహ వయసు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు మోడళ్ళపై పని చేస్తుందని మంత్రి అజయ్ చౌరాసియా వెల్లడించారు. ఇందులో మొదట వివాహ వయసును తగ్గించడం కాగా, రెండోది రోమియో జూలియట్ చట్టం. ఈ చట్టం అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో వుంది. ఈ చట్టం ప్రకారం వివాహం కాకున్నా, నిర్ధేశిత వయసు కన్నా ముందుగా ఇద్దరు యువతీయువకులు శృంగారంలో పాల్గొన్నా దానిని అత్యాచారంగా పరిగణించరు. అయితే వారి మధ్య మూడేళ్ల వ్యత్యాసం మాత్రం ఖచ్చితంగా ఉండితీరాల్సివుంది. 
 
నేపాల్‌లోని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 2017 ప్రకారం 18 యేళ్ళలోపు యువతితో లైంగిక సంబంధం నెరిపితే దానిని లైంగికదాడిగా పరిగణిస్తారు. ఈ క్రమంలో ఆ యువతి అంగీకారమున్నప్పటికీ చట్టం మాత్రం అంగీకరించదు. దీంతో వేల మంది యువకులు 18 యేళ్లలోపు అమ్మాయిలను ప్రేమ వివాహాలు చేసుకున్నా వారి అంగీకారంతో పెళ్లి చేసుకున్నా ప్రభుత్వం నేరంగా పరిగణించడంతో బాల్య వివాహ నేరంతో పాటు అత్యాచార కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో వివాహ వయసు 18 యేళ్లకు తగ్గించాలని నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం