Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Advertiesment
Ruksar Dhillon

దేవి

, శుక్రవారం, 7 మార్చి 2025 (11:27 IST)
Ruksar Dhillon
కృష్ణార్జున యుద్ధం, అశోకవనంలో అర్జున కల్యాణం, ఎబిసిడి–అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ తదితర సినిమాల్లో నటించిన నాయిక రుక్సార్ ధిల్లాన్ కు చేదుఅనుభవం ఎదురైంది. అదికూడా ఫోటోగ్రాఫర్ల వల్లే. తన అసౌకర్యాన్ని పట్టించుకోకుండా ఫోటోలు తీస్తూనే ఉన్నందుకు ఫోటోగ్రాఫర్లను విమర్శించింది. హైదరాబాద్ లో జరిగిన దిల్‌రుబా ఈవెంట్‌ కు ఆమె పింక్ ఆఫ్-షోల్డర్ పెప్లం టాప్ మరియు సెంటర్ స్లిట్ ఉన్న డెనిమ్ స్కర్ట్‌లో కనిపించింది.

ఆమె ఈవెంట్ కు రాగానే ఫోటో ఫోటో గ్రఫేర్స్ ఆమె వెనుకపడి ఫోటోలు తీసారు. అందుకు ఆమె సహకరించింది. కాని మరింతగా సిట్టింగ్ పొజిషన్ లో ఫోటోలు కావాలని కొందరు అడగానే ఆమె తిరస్కరించింది. దానితో ఆమెను పబ్లిసిటీ చేయకుండా ఫోటోలు కట్ చేస్తామని వారు అనుకోవడం ఆమె చెవిన పడింది. 
 
కాసేపు ఆవేదనతో కంటి వెంట నీళ్ళు వచ్చాయి. అంతరం తేరుకుని, దుల్ రుబా సినిమా గురించి మాట్లాడాక, తన గురించి ఇలా చెప్పింది. "ఇది చెప్పాలా వద్దా అని నాకు కొంచెం భయంగా ఉంది. కానీ ఇది ముఖ్యం. ప్రేక్షకుల్లో ఎంత మంది మహిళలు ఉన్నారు? మీరు మీ చేతులు ఎత్తగలరా? ఎవరైనా మిమ్మల్ని అసౌకర్యంగా ఫోటోలు తీస్తుంటే, మీరు దానికి అంగీకరిస్తారా? గౌరవంతో, నేను అసౌకర్యంగా ఉన్నానని దయచేసి ఫోటోలు తీయవద్దని చెబుతున్నాను. అది సరైనదా కాదా? వేదికపై ఏమి జరిగిందో మీరు చూశారు. నేను పేర్లు చెప్పను. కానీ, సందేశం మీకు చేరింది అది చాలు."అని పేర్కొంది.
 
ఇదిలా ఉండగా, సినిమా ప్రమోషన్ లో చాలా మంది నాయికలు డ్రెస్ కోడ్ చాలా ఎబ్బెతుగా ఉంటుంది. రుక్సార్ ధిల్లాన్ కూడా తన డ్రెస్ ను ప్రతిసారి సరిచేసుకోవడం కనిపించింది. అంత అసౌకర్యం గా ఎందుకు వేసుకోవాలని గుసగుసలు వినిపించాయి. ఏది ఏమైనా  దిల్  రుబా బ్లిసిటీ కి బాగా ఉపయోగపడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక