Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కాతమ్ముడిపై యూపీలో యాసిడ్ దాడి.. అసలెందుకు జరిగింది?

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (11:02 IST)
యూపీలో యాసిడ్ దాడి కలకలం రేపింది. బరేలీలో ఇంట్లో నిద్రిస్తున్న సోదరీసోదరుడిపై దుండగులు యాసిడ్ బాటిల్ విసిరారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తోబుట్టువులు వారి మేనమామతో పాటు అద్దె వసతిలో ఉన్నారు. వారి తండ్రి పిలిభిత్‌లో దంతవైద్యుడు.
 
బరేలీలోని ఇజ్జత్ నగర్ ప్రాంతంలోని వారి అద్దె వసతి గృహంలో నిద్రిస్తుండగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వారిపై యాసిడ్ పోయడంతో 19 ఏళ్ల యువతి, ఆమె 17 ఏళ్ల సోదరుడు తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు.
అక్కాతమ్ముడు అద్దె ఇంట్లో మేనమామతో ఉంటున్నారు. బాలిక నీట్‌కు సిద్ధమవుతోందని, ఆమె సోదరుడు బరేలీ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడని నగర అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రాహుల్ భాటి తెలిపారు. 
 
మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మామ బయట నిద్రిస్తుండగా, లోపల నుంచి తాళం వేయని గదిలోకి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి, తోబుట్టువులపై యాసిడ్ పోశారని రాహుల్ భాటి తెలిపారు.
 
ఇద్దరూ తెల్లవారుజామున 2 గంటల వరకు చదువుకుని నిద్రకు ఉపక్రమించారని వారి తల్లి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఇక యాసిడ్ దాడికి గురైన అక్కాతమ్ముడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ యాసిడ్ దాడి ఎందుకు జరిగిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments