చెల్లి శవాన్ని ఐదు కిలోమీటర్లు భుజాన మోసుకెళ్లిన అన్నలు!!

వరుణ్
శుక్రవారం, 12 జులై 2024 (16:39 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్‌లో గుండెలను పిండేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయిన తన చెల్లి శవాన్ని ఇద్దరు అన్నలు ఐదు కిలోమీటర్ల దూరం భుజనా వేసుకుని ఎత్తుకెళ్లారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదాకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని పాలియాలో శివానీ అనే బాలిక తన ఇద్దరు సోదరులతో కలిసి నివసిస్తూ 12వ తరగతి చదువుతోంది. రెండు రోజుల కిందట శివానీ టైఫాయిడ్ బారినపడింది. ఆమెను సోదరులు స్థానిక వైద్యుడికి చూపించగా మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. కానీ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పాలియాలోని రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. 
 
శారదా నది ఉప్పొంగడంతో జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. వాహన రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈలోగా ఆమె పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే దారిలో మరణించింది. దీంతో ఇక చేసేదిలేక సోదరులు విలపిస్తూనే ఆమె మృతదేహన్ని 5 కిలోమీటర్లమేర భూజాన మోసుకుంటూ తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.
 
ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తీశాడు. ఆ వీడియోలో రైలు పట్టాల పక్క నుంచి సోదరి మృతదేహాన్ని అన్నలిద్దరూ తీసుకెళ్లడం కనిపించింది. ఆ పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తినట్లు ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అధికార వ్యవస్థ ఇలా పనిచేస్తోందని ఓ యూజర్ విమర్శించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

తర్వాతి కథనం
Show comments