Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 29 జులై 2025 (14:06 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌నత్‌లో ఓ దారుణం జరిగింది. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను ఓ భార్య సజీవదహనం చేసింది. ఈ కేసులో ఆమె ప్రియుడు, ఆమె మామతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, స్థానిక కందేరా గ్రామానికి చెందిన సన్నీకి గర్హీ కంగరాన్ గ్రామానికి చెందిన అంకితతో గత యేడాది పెళ్లి అయింది. ఈ నెల 22వ తేదీన కావడీ యాత్రలో భాగంగా గంగా జలం తీసుకొచ్చేందుకు సన్నీ బైకుపై హరిద్వార్ వెళ్లాడు. అయితే, కంగరాన్ గ్రామ రోడ్డు సమీపంలో నలుగురు వ్యక్తులు సన్నీ బైక్‌ను ఆపి అతనిపై దాడి చేశారు. 
 
ఆ తర్వాత సన్నీని అంకిత తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ సన్నీపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడుని తొలుత మీరట్‌‍లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి రిఫర్ చేయగా, అక్కడ చికిత్స పొందుతూ సన్నీ ప్రాణాలు విడిచాడు. మృతుని తండ్రి వేద్‌పాల్ ఫిర్యాదు మేరకు అంకిత, అయ్యూబ్, బేబీ, సుశీల్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments