Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి విందు వడ్డించడంలో ఆలస్యం... వివాహాన్ని రద్దు చేసుకున్న వరుడు...

ఠాగూర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (10:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చందౌలిలో ఓ విచిత్ర ఘటన జరిగింది. పెళ్లిలో విందు వడ్డించడంలో ఆలస్యమైందన్న కారణంతో వరుడు వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. పెళ్లి కూతురు, ఆమె కుటుంబాన్ని మండపంలోనే వరుడు వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అదే రోజు సమీప బంధువు మెడలో తాళి కట్టాడు. దీంతో వధువు, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పెళ్లికి ముందే వరుడి కుటుంబానికి రూ.1.5 లక్షలు ఇచ్చామని తెలిపారు.
 
మెహతాబ్‌లో బాధిత యువతికి ఏడు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. ఈ నెల 22వ తేదీన పెళ్లి ఊరేగింపు వధువు స్వగ్రామమైన హమీద్‌పూర్ గ్రామానికి చేరుకుంది. తాను అప్పటికే రెడీగా ఉన్నానని, పెళ్లి కొడుకు, ఆమె కుటుంబ సభ్యులు విందు ఆరగించిన తర్వాత తన తల్లిదండ్రులను దుర్భాషలాడటమే కాకుండా కొట్టి పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారని బాధిత వధువు ఆరోపించింది.
 
పెళ్లికొచ్చిన వారు విందు ఆరగించేందుకు కూర్చున్నారని, మెహతాల్‌కు వడ్డించడంలో కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని వధువు అంగీకరించింది. ఈ విషయంలో అతడి స్నేహితులు హేళన చేయడంతో అవమానానికి గురైన మెహతాబ్ వధువు కుటుంబంతో గొడవకు దిగాడు. అది మరింత ముదరడంతో చేయి కూడా చేసుకున్నాడు. 
 
గ్రామస్థులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. వధువును పెళ్లాడేందుకు నిరాకరించిన మెహతాబ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. వధువు కుటుంబ సభ్యులు షాక్‌లో ఉండగానే అదే రోజు మెహతాబ్ తన కజిన్‌ను వివాహం చేసుకున్నాడు.
 
పెళ్లి రద్దు చేసుకున్న మెహతాబ్, ఆయన కుటుంబంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ వధువు కుటుంబం తాజాగా ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకుంది. పెళ్లి రద్దు కావడంతో తాము రూ.7 లక్షలు నష్టపోయినట్టు వివరించారు. అలాగే, వరుడి కుటుంబానికి రూ.1.5 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. కాగా, వరుడి కుటుంబం రూ.1.61 లక్షలు తిరిగి చెల్లించేందుకు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments