Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవధ్‌ను గెలిస్తే యూపీని గెలిచినట్టే.. నేడు యూపీలో నాలుగో దశ పోలింగ్...

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (08:10 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే మూడు దశల్లో పోలింగ్ ముగిసింది. ఇపుడు నాలుగో దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ దశ ఎన్నికలే రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
రాష్ట్రంలోని అవధ్ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. అవధ్‌ను గెలిస్తే యూపీనే గెలిచినట్టేనన్న నానుడి కూడా ఎప్పటి నుంచో ఉంది. దీంతో అవధ్‌లో అధిక సీట్లను గెలుచుకునేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డిపోరాడాయి. 
 
ఈ దశలో మొత్తం 9 జిల్లాల్లో 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయిబరేలి లోక్‌సభ స్థానం, అలాగే, మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఫిలిబిత్ స్థానాలు అవధ్ రీజియన్‌లోనే ఉన్నాయి. 
 
అదేవిధంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులను కారుతో తొక్కించి చంపిన వ్యవహారం దేశ రాజకీయాలను ఓ కుదుపుకుదిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ప్రాతినిథ్యం వహిస్తున్న లఖింపూర్ ఖేరీ స్థానంలో కూడా నాలుగో దశలో పోలింగ్ జరుగనుంది. 
 
మొత్తంగా ఈ నాలుగో దశ ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. మొత్తం 60 సీట్లలో 624 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో కాంగ్రెస్, బీఎస్పీలు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 57, ఎస్పీ 58 చోట్ల పోటీ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments