Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుకను చంపిన నిందితుడిపై 30 పేజీల చార్జిషీట్

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (09:19 IST)
ఎలుకను చంపిన కేసులో నిందితుడిపై పోలీసులు 30 పేజీల చార్జిషీటును తయారు చేసి కోర్టుకు అందజేశారు. ఈ ఎలుక హత్య గత యేడాది నవంబరులో జరిగింది. ఎలుక తోకకు రాయికట్టిన నిందితుడు కుమార్ దానికి కాలువలో పడేశాడు. దీంతో అది చనిపోయింది. దీన్ని గమనించిన వికేంద్రశర్మ అనే వ్యక్తి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయగా, అది అప్పటికే చనిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
దీంతో నిందితుడిపై వికేంద్రశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నిందితుడు బెయిలుపై విడుదలయ్యాడు. ఎలుక కళేబరానికి శవపరీక్ష చేసి ఫోరెన్సిక్ నివేదికను తయారు చేశారు. ఇందులో కాలేయ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకిందని, ఫలితంగా అది ఊపిరాడక చనిపోయినట్టు తేలింది. 
 
ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా నిందితుడు కుమార్‌పై 30 పేజీల చార్జి‌షీటును దాఖలు చేశారు. కాగా, ఈ ఘటనపై కుమార్ తండ్రి మతూరా కుమార్ మాట్లాడుతూ, తన కుమారుడిపై చర్యలు తీసుకోవడానికి ముందు కోళ్లు,చేపలు, గొర్రెల మాంసాన్ని విక్రయించే వారిపైన, ఎలుకలను చంపే రసాయనాలు అమ్మే వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments