Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. బతికిపోయానని అత్యాచార ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకున్నారా? బాధిత కుటుంబం ఏమన్నది?

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (21:11 IST)
ఉన్నావో అత్యాచార కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ తీజ్‌హజారీ కోర్టు జీవితకారాగార శిక్షను విధించింది. ఈ సమయంలో సెంగార్ ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనిపై సోషల్ నెట్వర్కింగ్ మాధ్యమాల్లో కామెంట్లు పేలుతున్నాయి. సెంగార్ ఉద్వేగం ఎందుకు చెందారంటే.. కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో...  హమ్మయ్య, బతికిపోయానని అనుకుని కన్నీరు పెట్టుకున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. 
 
ఇకపోతే కుల్దీప్ బాధితురాలికి రూ.25 లక్షలు చెల్లించాలంటూ జరిమానా వేసింది. బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు ఉన్న ముప్పును సీబీఐ అంచనా వేసి, సురక్షిత నివాసం కల్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. కాగా, గత 2017 జూన్ 4వ తేదీన ఓ యువతిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినట్లు సెంగార్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై విచారణ చేపట్టిన తీజ్‌హాజారీ కోర్టు కుల్దీప్‌ను ఇటీవల దోషిగా ప్రకటించింది. అయితే, శిక్షలను మాత్రం శుక్రవారం ఖరారు చేసింది. తాజాగా శుక్రవారంనాడు తీర్పును వెలువరుస్తూ యావజ్జీవ శిక్షను ప్రకటించింది. దీంతో ఆయన జీవితాతం జైలులోనే ఉండాల్సి వస్తుంది.
 
కాగా, 2017 నుంచి అత్యాచారం కేసుపై పోరాటం చేస్తున్నా తనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితురాలు సీఎం యోగి నివాసం ఎదుట కొద్దికాలం క్రితం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఈ కేసు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. కుల్దీప్‌పై కేసు పెట్టారనే అకారణంగా ఆయన సోదరుడు తన తండ్రిని చెట్టుకు కట్టేసి బహిరంగంగా కొట్టారని కూడా ఆమె చెప్పింది. యోగి చొరవతో దీనిపై కేసు నమోదైంది. 
 
ఈ కేసులో కుల్దీప్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని, మహిళల అపహరణ, అత్యాచారం, నేరపూరిత బెదిరింపులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరిపారు. అనంతరం సీబీఐ అధికారులు కేసును పారదర్శకంగా విచారణ చేయడం లేదంటూ ఢిల్లీ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు సీబీఐ నుంచి కేసును తీస్ హజారీ కోర్టుకు బదిలీ చేసింది. కేసుపై విచారణ చేపట్టిన తీస్ హాజారీ న్యాయ‌స్థానం కుల్దీప్‌ను దోషిగా ప్రకటించింది. తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments