Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల ఖాతాల్లో డబ్బు వేస్తాం. కానీ.. అది చెల్లించాల్సిన రుణమే

తిరిగి చెల్లించే రుణం రూపంలోనే సార్వత్రిక ప్రాథమిక ఆదాయం

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (02:12 IST)
ప్రజల ఖాతాల్లో  డబ్బులు బదిలీ చేయడానికి అభ్యంతరం లేదు కానీ అలా ఇచ్చిన డబ్బులను తిరిగి చెల్లించాల్సిన రుణం లాగే భావిస్తామని నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొన్ని విభాగాలు సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్) అనే భావనను విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అది ఉచితంగా ఇచ్చే డబ్బుగా ఉండదని అమితాబ్ వివరణ ఇచ్చారు. 
 
ప్రపంచంలో కొన్ని దేశాలు తమ ప్రజలు పనిచేసినా, చేయకున్నా జాతీయ సంపదలోంచి కొంత డబ్బును సార్వత్రిక ప్రాథమిక పథకం రూపంలో ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు రూపంలో బదిలీ చేయడం పట్ల సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా అధికారికంగా స్పందించనప్పటికీ ఈ కొత్త భావనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 
 
స్విట్జర్లండ్ లోని దావోస్‌లో నాలుగవ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో మంగళవారం ఒక సెషన్‌లో  ప్రసంగించిన నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఇలా ప్రజలకు డబ్బు ఇచ్చే పథకం మంచిదే కానీ ఇది ఉచితంగా ఉండరాదని సూచించారు. ఉత్పాదక ప్రయోజనాల కోసం ఇచ్చే రుణంగానే అలాంటి డబ్బు బదిలీని భావించాలని, దాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. 
 
యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ స్వప్నమా లేక ప్రళయమా అని చర్చించిన ప్యానెల్‌లో కాంత్ భాగంగా ఉండి చర్చలో పాల్గొన్నారు. 
 
శ్రమ ప్రపంచంలో మౌలిక మార్పులనేవి సాంప్రదాయికమైన సామాజిక భద్రతా యంత్రాంగాలను ధ్వంసం చేసేశాయని, ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ప్రాథమిక ఆదాయం అనేది చర్చల్లోకి వచ్చిందని కాంత్ తెలిపారు.
 
కాగా గత సంవత్సరం స్విట్జర్లండ్ ప్రజలు ఈ నూతన భావనకు చెందిన ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments