Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వదిన గారి అప్పడం' తింటే కరోనా మాయం : సెలవిచ్చిన కేంద్ర మంత్రి

Webdunia
శనివారం, 25 జులై 2020 (10:50 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. కానీ, కొందరు రాజకీయ నేతలు మాత్రం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అలాగే, వైరస్ సోకినప్పటికీ.. ఐసోలేషన్‌లో ఉండకుండా, స్వేచ్ఛగా ప్రజల మధ్య తిరుగుతున్నారు.
 
అంతేకాకుండా, కరోనా విషయంలో ఎవరూ ఎలాంటి తప్పుడు సమాచారం వ్యాపింపచేయరాదని ఓవైపు ప్రభుత్వాలు, మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పదే పదే మొత్తుకుంటున్నాయి. అయినప్పటికీ కొందరు మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. 
 
తాజాగా, కేంద్ర మంత్రి ఒకరు... అప్పడం తింటే కరోనాను జయించవచ్చని సెలవిచ్చారు. ఆయన పేరు అర్జున్ రామ్ మేఘ్వాల్. కేంద్ర జలవనరులు, నదీ అభివృద్ధి, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి.
 
అది కూడా మామూలు అప్పడం కాదట.. 'భాభీజీ పాపడ్' (వదిన గారి అప్పడం) అనే బ్రాండెడ్ అప్పడం అయితేనే కరోనాతో సమర్థంగా పోరాడుతుందని సెలవిచ్చారు. ఈ అప్పడం తింటే ఒంట్లో కావాల్సినన్ని యాంటీబాడీలు తయారవుతాయని, దాంతో కరోనాపై కత్తిదూయవచ్చని వివరించారు. 
 
ఈ 'భాభీజీ అప్పడం' గురించి ప్రత్యేకంగా చెబుతూ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వదిలారు. అయితే దీనిపై విమర్శలు మామూలుగా రాలేదు. రకరకాల కామెంట్లతో నెటిజన్లు ఆడుకున్నారు. సోషల్ మీడియాలో దీనిపై జోకులు, మీమ్స్ భారీ స్థాయిలో దర్శనమిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments