Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన రెండేళ్లకు మరదలితో అక్రమ సంబంధం.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..?

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (16:00 IST)
పెళ్లైన రెండేళ్ళకు మరదలితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. అయితే తమ బంధాన్ని పెద్దలు అంగీకరించరని తెలిసి ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని మొరాబాదాబాద్ జిల్లా ధర్కానగ్లా గ్రామలో నివసించే రాజ్ కుమార్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. గతేడాది పనిమీద సంబల్‌లో నివసించే తన మామ గారింటికి వెళ్లాడు.
 
అక్కడ ఉన్న సమయంలో పెళ్లి కాని భార్య చెల్లెలితో కాస్త చనువుగా ఉండటం మొదలెట్టాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లకు ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
 
ఇంట్లో పెద్దలు తమ బంధాన్ని ఒప్పుకోరని తెలుసుకున్నారు. విడిపోయి దూరంగా ఉండలేమనుకున్నారు. కలిసి జీవించే పరిస్థితి లేదు. దీంతో వారిద్దరూ బలవన్మరణానికి సిధ్ధమయ్యారు. అలా ఇంటి నుంచి పారిపోయిన ఆ జోడీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. పోలీసుల సహాయంతో వారు ఉన్న ప్రాంతాన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన బంధువులు అక్కడకు చేరుకున్నారు.
 
ఇద్దరినీ సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో రాజ్ కుమార్ పై ఐపీసీ సెక్షన్ 366 (మహిళను కిడ్నాప్ చేయటం, పెళ్లి చేసుకోమని బలవంతం చేయటం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments