కరోనా సోకింది నాకు కాదు.. లోపలున్న వ్యక్తికి.. అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (15:38 IST)
నిర్లక్ష్యం ఎంత ప్రమాదమో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ నిర్లక్ష్యం వల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. అందుకే ఏ విషయంలోనూ నిర్లక్ష్యం తగదంటారు. కానీ ఇక్కడో అంబులెన్స్ డ్రైవర్ ఏకంగా కరోనా పేషంట్ విషయంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అంబులెన్స్‌లో కరోనా పేషంట్ పెట్టుకొని.. చెరుకు రసం కోసం ఏకంగా జ్యూస్ బండి దగ్గరే ఆగాడు. ఈ నిర్లక్ష్యపు ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. 
 
షాడోల్ జిల్లాలో ఒక అంబులెన్స్ డ్రైవర్ కరోనా పేషంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు. మార్గమధ్యలో డ్రైవర్.. చెరుకు రసం తాగడం కోసం అంబులెన్స్‌ను రోడ్డు పక్కన ఆపాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి.. ‘మీరు కరోనా పేషంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు కదా.. మరి మీరు మాస్కు పెట్టుకోకుండా జ్యూస్ తాగడం కోసం రావడమేంటి? మీ నుంచి కరోనా జ్యూస్ పాయంట్ దగ్గరికి వచ్చే వాళ్లందరికీ వస్తే పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించాడు. 
 
అందుకు సమాధానంగా అంబులెన్స్ డ్రైవర్.. ‘నాకు కరోనా లేదు.. నేను కేవలం కరోనా సోకిన పేషంట్‌ను మాత్రమే తీసుకెళ్తున్నాను. నన్ను జ్యూస్ తాగనివ్వండి’ అని చెప్పాడు. ఇదంతా ప్రశ్నించిన వ్యక్తి వీడియో తీస్తున్నాడని తెలుసుకున్న అంబులెన్స్ డ్రైవర్ వెంటనే మాస్కు ధరించాడు. 
 
ఇప్పటికే మధ్యప్రదేశ్ వేగంగా కరోనా విస్తరిస్తున్న రాష్ట్రంగా ఉంది. దేశంలో 84 కేసులు నమోదు అవుతున్న పది రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఒకటి. ఇక్కడ మొత్తం 3,41,887 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 54,000 మంది మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments