బరువు తగ్గాడు.. నిధులు రాబట్టాడు.. ఎంపీకి ప్రశంసలు

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (09:51 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని లోక్‌సభ సభ్యుడు, బీజేపీ నేత అనిల్ ఫిరోజియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అనిల్ బరువు తగ్గితే నియోకవర్గానికి భారీగా నిధులు మంజూరు చేస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. అంతే.. బరువు తగ్గడమే ఓ లక్ష్యంగా పెట్టుకున్న ఎంపీ అనిల్ ఫిరోజియా బరువు తగ్గి ఇప్పటికే రూ.2300 కోట్లు సంపాదించారు. 
 
అయితే, ఒక వ్యక్తి బరువు తగ్గితే ఇన్ని కోట్లు ఇస్తారా? అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకే ఈ నిధులను కేంద్రం కేటాయించింది. "నువ్వు బరువు తగ్గితే.. నీ నియోజకవర్గ అభివృద్ధికి కేజీకి రూ.వెయ్యి కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తా" అంటూ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విసిరిన సవాలు అనిల్‌ ఫిరోజియాలో స్ఫూర్తి నింపింది.
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన ఆయన... బరువు తగ్గేందుకు కసరత్తులు ప్రారంభించారు. ఏడు నెలలు తిరిగేసరికల్లా 32 కిలోల బరువు తగ్గారు. ఫిబ్రవరిలో 127 కేజీల బరువున్న అనిల్‌.. ప్రస్తుతం 95 కేజీలకు చేరుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే రూ.2,300 కోట్ల నిధులు రాబట్టారు. 
 
రోజువారీగా తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చేయడంతోపాటు సైక్లింగ్‌, యోగా చేశానని అనిల్‌ తెలిపారు. ఈ ప్రయత్నం ఇంతటితో విరమించబోనని.. మరింతగా బరువు తగ్గి తన నియోజకవర్గానికి మరిన్ని నిధులు సాధిస్తానని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments