తమిళనాడులో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. 234 స్థానాలు వున్న తమిళనాడులో డీఎంకే సారథ్యంలోని సంకీర్ణ కూటమి 159 నియోజకవర్గాల్లో విజయఢంకా మోగించింది. మే ఏడో తేదీన సీఎంగా ఎంకే స్టాలిన్‌తో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు. అంతేగాకుండా ఇన్నాళ్లు కేబినెట్‌కు దూరంగా పెట్టిన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు పట్టం కట్టనున్నారు. అనుభవం కోసం ఇన్నాళ్లు కేబినేట్‌కు దూరంగా వున్న ఉదయనిధి ప్రస్తుతం తండ్రి కేబినెట్‌లో స్థానం దక్కించుకోనున్నాడు.
కాగా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ చేపాక్- తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్‌కు యువజన సర్వీసుల వ్యవహారాలు, క్రీడలు స్పెషల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖలను అప్పగించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.