Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర: గురువారం బలపరీక్ష.. ముంబైకి ఏక్‌నాథ్ షిండే

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (17:16 IST)
మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్ గురువారంతో ముగియనుంది. రేపు బలపరీక్షకు మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ ఆదేశించారు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్షకు డెడ్ లైన్ విధించారు. దీంతో రేపు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. 
 
బలపరీక్షపై సీఎం ఉద్ధవ్‌కు గవర్నర్ కోశ్యారీ లేఖ రాశారు. అయితే గవర్నర్ నిర్ణయంపై శివసేన నేత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  
 
బలపరీక్ష కోసం రేపు ముంబైకి వెళుతున్నామన్నారు ఏక్ నాథ్ షిండే. ఇక రోజురోజుకు ఏక్ నాథ్ షిండే మద్దతు పెరుగుతోంది. మరి కొంతమంది నేతలు షిండే క్యాంపులోకి వెళ్లేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షిండే  క్యాంపులో 39 శివసేన నేతలు ఉన్నారు. 
 
కానీ  శివసేనలో 19 ఎంపీలు ఉండగా  వారిలో మరికొందరు  షిండే క్యాంపులో చేరేందుకు సిద్ధమవుతున్నారని  తెలుస్తోంది. అలాగే త్వరలోనే గవర్నర్ ను కలుస్తామని షిండే కూడా ప్రకటించారు.
 
మరోవైపు షిండే వర్గంతో కలిసి  బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు కసరత్తు  చేస్తోంది.  

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments