Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: 20 లక్షల మందికి కొత్తగా పింఛన్లు

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (16:52 IST)
ys jagan
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. నవరత్నాల్లో భాగంగా వివిధ పథకాలతో పాటు వైఎస్‌ ఆర్‌ పింఛన్‌ కానుకను అమలు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశిస్తున్నారు. 
 
అర్హులైన వారికి పెన్షన్‌ అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 20 లక్షల మందికి కొత్తగా పింఛన్లను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో నిరుపేదలకు అండగా ఉంటూ పెన్షన్‌ పథకాలను విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో మరో కొత్తగా 3 లక్షల 98 మందికి సామాజిక పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 
 
గత ఏడాది డిసెంబర్‌లోనూ ప్రభుత్వం 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం. తర్వాత డిసెంబర్‌ 1 నుంచి ఈ సంవత్సరం జూన్‌ 15వ తేదీ మధ్య పింఛన్ల కోసం దరఖాస్తులు అందగా, వాటిని జూన్‌ 15-23 తేదీల మధ్య రెండు విడతలుగా పరిశీలిన జరిగింది. 
 
ఇందులో భాగంగా దాదాపు 3లక్షల మంది పెన్షన్‌కు అర్హులని తేల్చింది జగన్‌ ప్రభుత్వం. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతోపాటు పింఛన్‌ కార్డు, పాస్‌బుక్‌లను అందించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments