Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నోర్మూసుకో.. లేకపోతే కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తా'' యువతికి ఉబెర్ క్యాబ్ డ్రైవర్

క్యాబ్ ఎక్కిన యువతిని ''నోర్మూసుకో.. లేకపోతే కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తా'' అంటూ డ్రైవర్ బెదిరించిన ఘటన పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో జరిగింది. దాంతో ఆ యువతి మారుమాట మాట్లాడకుండా కిక్కురుమనకుండ

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (08:58 IST)
క్యాబ్ ఎక్కిన యువతిని ''నోర్మూసుకో.. లేకపోతే కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తా'' అంటూ డ్రైవర్ బెదిరించిన ఘటన పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో జరిగింది. దాంతో ఆ యువతి మారుమాట మాట్లాడకుండా కిక్కురుమనకుండా కూర్చుంది. యాప్ ద్వారా ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంటే జాగ్రత్తగా ఇంటికి వెళ్లొచ్చని చేరుకొవచ్చనుకుంటే ఈ దారుణమేంట్రా బాబు అని హడలిపోయింది. దాంతో కదులుతున్న కారులోంచి కిందకు దూకేసింది. అయినా ఆగని డ్రైవర్, ఆమెను కారుతో తొక్కించేయాలని చూశాడు. 
 
దాంతో క్యాబ్ డ్రైవర్ సంతు పర్మాణిక్ (28)ను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. యాప్ ద్వారా ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంటే జాగ్రత్తగా ఇంటికి వెళ్లొచ్చని ఇద్దరు స్నేహితురాలు కలిసి క్యాబ్ బుక్ చేసుకున్నారు. కాసేపు కొంతదూరం ప్ర‌యాణించారు. వీరిలో ఒకరు మధ్యలోనే దిగిపోయారు అప్పటివరకు బాగానే ఉన్న డ్రైవర్ సందుల్లోంచి  వేగంగా వెళ్లడం ప్రారంభించాడు. అప్పటివరకు బాగానే ఉన్న డ్రైవర్, ఆ తర్వాతి నుంచి తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. వేగంగా వెళ్తూ మార్గ మధ్యంలో సందుల్లోంచి వెళ్లసాగాడు. 
 
అదికూడా నిర్మానుష్యంగా ఉండటంతో.. మెయిన్ రోడ్డు మీదుగా వెళ్లాలని ఆమె చెప్పింది. మొదట సరేనని తలూపినా, కాసేపటి తర్వాత మళ్లీ సందుల్లోకే పోయాడు. దీనిపై ఆమె దిగాల్సిన ప్రాంతం వచ్చేవరకు ఆమెతో వాదిస్తూనే ఉన్నాడు. కారు ఆపమని తాను అనగానే అతడు ఒక్కసారిగా మండిపడ్డాడని, మరొక్క మాట మాట్లాడితే కిడ్నాప్ చేసి.. రేప్ చేస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది. 
 
దాంతో భయపడిన యువతి కిటికీ అద్దం కిందకు దించి, అరవడం మొదలుపెట్టానని, అయితే రోడ్డు నిర్మానుష్యంగా ఉండటంతో ప్రయోజనం లేదని చెప్పింది. కిందకు దూకేయడానికి  ప్రయత్నించింన‌పుడు గమనించిన డ్రైవర్.. తన సీటును వెనక్కి జరిపి ఆమెను అడ్డుకుని, పట్టుకోడానికి ప్రయత్నించడంతో ఎలాగోలా ఆమె తలుపు తెరుచుకుని కిందకు దూకేసింది. 
 
దాంతో అతడు అరుస్తూ కారు కింద తొక్కేస్తానని బెదిరించాడు. కారు రివర్స్ చేసుకుంటూ మీదకు రావడంతో ఆమె ఫుట్ పాత్ వద్దకు వెళ్లి బయటపడింది. తర్వాత ఆమె ఉబర్ సంస్థతో పాటు పోలీసులకు కూడా దీనిపై ఫిర్యాదుచేసింది. దాంతో పోలీసులు ఆ క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments