కేరళలో కూలిన నేవీ శిక్షణ విమానం.. ఇద్దరు మృతి

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (11:47 IST)
కేరళ రాష్ట్రంలో ఘోరం జరిగింది. నేవీ శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఇద్ద‌రు నౌకాద‌ళ అధికారులు మృతిచెందారు. రోజువారీ శిక్ష‌ణ‌లో భాగంగా ఆదివారం ఉద‌యం ఐఎన్ఎస్ గ‌రుడ నుంచి బ‌య‌ల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే కొచ్చిలోని నావెల్ బేస్ స‌మీపంలో ఉన్న తొప్పంపాడి బ్రిడ్జి వ‌ద్ద కుప్ప‌కూలిపోయింది.
 
ఈ ప్రమాదంలో అందులో ఉన్న నేవీ అధికారులు లెఫ్టినెంట్ రాజీవ్ ఝా (39), పెట్టీ ఆఫీస‌ర్ సునీల్ కుమార్ (29) అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై నౌకాద‌ళ ఉన్న‌తాధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. రాజీవ్ ఝా ఉత్త‌రాఖండ్‌కు చెందిన‌వారు. ఆయ‌న‌కు భార్యా, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. 
 
సునీల్ కుమార్ స్వ‌స్థ‌లం బీహార్. ఆయ‌న‌కు ఇంకా వివాహం కాలేదు. కాగా, రెండు రోజుల క్రితం క‌ర్ణాట‌క‌లోని క‌ర్వార్ ప్రాంతంలో శిక్ష‌ణ విమానం కూలింది. విమానం స‌ముద్రంలో ప‌డిపోవ‌డంతో ఓ అధికారి మ‌ర‌ణించ‌గా, మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments