Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ పోల్ :: జేడీయు - బీజేపీల మధ్య ఫిప్టీ - ఫిప్టీ ఫార్ములా

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (11:01 IST)
బీహర్ రాష్ట్ర శాసనసభకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి. ఇందులోభాగంగా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. తాజాగా అధికార ఆర్జేడీ, బీజేపీల మధ్య కూడా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కివచ్చింది. బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా జేడీయూ 122, బీజేపీ 121 సీట్లల్లో పోటీ చేయనున్నాయి.
 
జితన్‌ రామ్ మంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీకి జేడీయూ కోటాలో సీట్లు ఇవ్వనున్నారు. కేంద్రం మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌‌జనశక్తి పార్టీకి బీజేపీ పలు సీట్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే, కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం నితిశ్ కుమార్, పాశ్వాన్ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌కు మధ్య వచ్చిన విభేదాలు ఆ కూటమిని కాస్త ఇరుకున పెట్టేలా ఉన్నాయి.
 
కాగా, మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరుగునున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. బీహార్‌లో అక్టోబరు 28, నవంబరు 3, 7 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబరు 10న ఫలితాలు వెల్లడవుతాయి. కరోనా నేపథ్యంలో దేశంలో జరుగుతోన్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments