Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు బాలికలు .. 8 మంది యువకులు.. అడవిలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (09:16 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన త్రిపురలో ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఈ దారుణానికి ఎనిమిది మంది యువకులు పాల్పడ్డారు. ఖౌవాయి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ సామూహిక లైంగికదాడిలో తీవ్రంగా గాయపడిన ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖటియాబరి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు తమ ఇద్దరు స్నేహితులతో కలిసి సోమవారం సాయంత్రం బైక్‌పై బయటకు వెళ్లారు. కొంతదూరం వెళ్లిన తర్వాత మరో ఆరుగురు యువకులు బైక్‌లపై వచ్చి వారిని కలిశారు. 
 
ఆ తర్వాత వారంతా కలిసి ఆ ఇద్దరు బాలికలను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు అపస్మారక స్థితికి వెళ్లడంతో భయపడిన యువకులు వారిని అక్కడే వదిలేసి పరారయ్యారు.
 
బాలికలు కనిపించకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారితో కలిసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అడవిలో అపస్మారకస్థితిలో ఉన్న బాలికలు కనిపించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఓ బాలిక పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను మరో ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది మంది కామాంధులపై  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం