Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాసిడ్‌ను కూల్‌డ్రింక్స్ అనుకుని తాగేసిన చిన్నారులు.. పుట్టినరోజు వేడుకలో విషాదం

యాసిడ్‌ను కూల్ డ్రింక్‌గా భావించి తాగిన చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలు ముగిసి నిమిషాలు కాకముందే ఓ చిన్నారి.. అతడి స్నేహితుడైన బాలుడు.. కూల్‌డ్రింక్స్

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (08:37 IST)
యాసిడ్‌ను కూల్ డ్రింక్‌గా భావించి తాగిన చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలు ముగిసి నిమిషాలు కాకముందే ఓ చిన్నారి.. అతడి స్నేహితుడైన బాలుడు.. కూల్‌డ్రింక్స్ అనుకుని యాసిడ్ తాగేశారు. క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరు, కెంపెగౌడ రోడ్డులో నివాసముంటే స్వర్ణకారుడైన శంకర్ కుమారుడు సాహిల్ శంకర్. ఇతడికి పుట్టిన రోజును ఘనంగా జరపాలని నిర్ణయించిన ఆయన స్నేహితులు, బంధువులను ఆహ్వానించాడు. కేట్ కట్ చేసి వేడుక ముగిసిన తర్వాత డిన్నర్‌కు సిద్ధమయ్యారు. 
 
అయితే సాహిల్, అతడి స్నేహితుడు ఆర్యన్ ఓ గదిలోకి వెళ్లారు. అక్కడ ఓ గాజు సీసాలో నిల్వ చేసిన సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను చూసిన వారు దానిని కూల్ డ్రింక్‌గా భావించి తాగేశారు. వెంటనే కుప్పకూలిపోయారు. యాసిడ్ తాగిన చిన్నారులను ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
దీంతో పుట్టిన రోజు వేడుకలు జరిగిన ఇంట విషాదం నెలకొంది. సాహిల్ మూడో తరగతి చదువుతుండగా, ఆర్యన్ రెండో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments