Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రమంత్రి ఔదార్యం.. తన ఫస్ట్‌క్లాస్ సీటును మరో మహిళకు ఇచ్చేశారు!

కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా ఔదార్యం ప్రదర్శించారు. విమానంలో తన ఫస్ట్‌క్లాస్ సీటును మరో మహిళకు ఇచ్చేశారు. ఆ తర్వాత ఆయన అదే విమానంలో సాధారణ వ్యక్తిలా మరో సీటులో కూర్చొని తన గమ్యస్థానానిక

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (08:37 IST)
కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా ఔదార్యం ప్రదర్శించారు. విమానంలో తన ఫస్ట్‌క్లాస్ సీటును మరో మహిళకు ఇచ్చేశారు. ఆ తర్వాత ఆయన అదే విమానంలో సాధారణ వ్యక్తిలా మరో సీటులో కూర్చొని తన గమ్యస్థానానికి చేరుకున్నారు. ఇంతకీ ఆ మహిళకు మంత్రి తన ఫస్ట్ క్లాస్ సీటును ఎందుకిచ్చారో ఓసారి పరిశీలిద్ధాం. 
 
శ్రేయ ప్రదీప్ అనే యువతి తన తల్లితో కలిసి అదే విమానంలో ప్రయాణిస్తోంది. తల్లి కాలికి దెబ్బతగలడంతో ఆమె నడవలేని స్థితిలో ఉంది. దీనికితోడు విమానంలో వారికి కేటాయించిన సీటు సరిగా లేకపోవడంతో అందులో కూర్చునేందుకు ఆమె చాలా ఇబ్బంది పడింది. 
 
ఆ మహిళ అవస్థను గమనించిన శ్రేయ.. అదేవిమానంలో ప్రయాణిస్తున్న కేంద్రమంత్రి జయంత్ సిన్హా వద్దకు వెళ్లి పరిస్థితి వివరించి, తమ సీట్లోకి వెళ్లి ఆ సీటును ఇవ్వాల్సిందిగా కోరింది. మంత్రి మరేమీ మాట్లాడకుండా భార్యతో కలిసి సీట్లు మారి వారికి తమ సీట్లను అప్పగించారు. మంత్రి చేసిన సాయాన్ని శ్రేయ ట్విట్టర్ ద్వారా పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. సిన్హాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి 'యు ఆర్ వెరీ వెల్‌కమ్' అని రీట్వీట్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments