Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకిలెక్కేందుకు చిరంజీవి సిద్ధం.. అయితే, కండిషన్స్ అప్లై...

మెగాస్టార్ చిరంజీవి రాజ‌కీయాల‌కు దాదాపు గుడ్‌బై చెప్పిన‌ట్లేనని ఆయ‌న సన్నిహితులు అంటున్నారు. ఇటీవ‌ల మెగా డాట‌ర్ సుష్మిత కూడా చిరంజీవి ప్ర‌స్తుతం కాస్త ప్ర‌శాంతంగా ఉన్నార‌ని చెప్పారు. అంటే, పాలిటిక్స్‌

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (16:52 IST)
మెగాస్టార్ చిరంజీవి రాజ‌కీయాల‌కు దాదాపు గుడ్‌బై చెప్పిన‌ట్లేనని ఆయ‌న సన్నిహితులు అంటున్నారు. ఇటీవ‌ల మెగా డాట‌ర్ సుష్మిత కూడా చిరంజీవి ప్ర‌స్తుతం కాస్త ప్ర‌శాంతంగా ఉన్నార‌ని చెప్పారు. అంటే, పాలిటిక్స్‌ను ఆయ‌న లైట్ తీసుకోవాలని ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా కోరుకుంటున్న‌ట్లే క‌దా.
 
ఇదంతా ఒక‌వైపు మ‌రోవైపు, చిరంజీవి రాజ‌కీయాల‌లో యాక్టివ్‌గా మార‌నున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో టీడీపీలో చేర‌తారంటూ కొద్ది రోజులుగా ప్ర‌చారం సాగుతోంది. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఉనికి కోల్పోవ‌డంతో చాలామంది టీడీపీ, బీజేపీ వైపు అడుగులు వేస్తున్న‌ట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. చిరు వర్గం సైతం ఇప్ప‌టికే  టీడీపీతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు సమాచారం. చిరు ఫ్యూచ‌ర్‌కి ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌ని రీతిలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు హామీ ఇస్తేనే మెగాస్టార్ సైకిలెక్కే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. అయితే, చిరు సైకిలెక్కేందుకు మూడు కండిష‌న్‌లు పెడుతున్నారట. అవేంటంటే... 
 
1. త‌న‌ను మ‌ళ్లీ రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని.
2. కేంద్ర మంత్రి ప‌ద‌వి కూడా ఇప్పించాల‌ని ..
3. 2019 ఎన్నిక‌ల‌లో తాను చెప్పిన 7గురికి ఎమ్మెల్యే టికెట్‌లు ఇవ్వాల‌ని...
 
వీటికి ఓకే అంటే.. టీడీపీకి తన సేవలను సమకూరుస్తానని చెప్పాడ‌ట‌. చిరు కండిష‌న్‌ల‌పై టీడీపీ అధిష్టానం కూడా దాదాపు రెడీగా ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. చిరుతో ముద్రగడకు శాశ్వతంగా చెక్ పెట్టెయటమే టిడిపి గేమ్ ప్లాన్‌గా ఉంది. కొద్ది రోజుల్లొనె దీనిపై క్లారిటీ రానుందట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments