Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ రేప్ కేసు... నాది కోసింది యువతి కాదు... నాకు పనికిరాదని నేనే కట్ చేసుకున్నా...

కేరళలో స్వామీజీ రేప్ కేసులో ట్విస్ట్. తనపై అత్యాచారం చేయబోయిన స్వామీజీ అంగాన్ని యువతి కోసేసిందంటూ వచ్చిన వార్తను ఖండించాడు స్వామీజి. తనకు దానితో ఇక పనిలేదని తనే దాన్ని కట్ చేసుకున్నానని అతడు పోలీసులకు చెప్పుకొచ్చాడు. కాగా అంతకుముందు యువతి ఫిర్యాదు వే

Webdunia
శనివారం, 20 మే 2017 (20:17 IST)
కేరళలో స్వామీజీ రేప్ కేసులో ట్విస్ట్. తనపై అత్యాచారం చేయబోయిన స్వామీజీ అంగాన్ని యువతి కోసేసిందంటూ వచ్చిన వార్తను ఖండించాడు స్వామీజి. తనకు దానితో ఇక పనిలేదని తనే దాన్ని కట్ చేసుకున్నానని అతడు పోలీసులకు చెప్పుకొచ్చాడు. కాగా అంతకుముందు యువతి ఫిర్యాదు వేరుగా వుంది. శుక్రవారం రాత్రి కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో జరిగిన వివరాలను పరిశీలిస్తే... కొల్లాంకు సమీపంలోని పద్మన అనే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి 54 ఏళ్ల గణేషానంద తీర్థపద స్వామి అలియాస్ హరి ఆశ్రమానికి క్రమంతప్పకుండా వెళుతూ ఉండేది.
 
అయితే, ఈ స్వామిపై నమ్మకం కుదరడంతో ఆశ్రమంలో తల్లిదండ్రులతో కలిసి యువతి ఉంటూ సేవలు చూస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆ యువతిపై కన్నేసిన స్వామీజీ తనకు సేవలు చేసుకునేందుకు నియమించుకున్నాడు. అలా ఆ యువతితో వ్యక్తిగత సేవలు పొందుతూ వచ్చిన దొంగబాబా... యువతిని లైంగికంగా వేధిస్తూ వచ్చాడు. 
 
ఈమధ్య కాలంలో అతని ఆగడాలు మరింతగా శృతిమించిపోయాయి. శుక్రవారం రాత్రి ఏకంగా యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వద్దని ఎంత చెప్పినా బాబా వినకుండా తనపై దారుణానికి యత్నించడంతో అతడి పురుషాంగాన్ని కోసిపారేసింది. ఆ తర్వాత స్థానిక పోలీసులకు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పి, ఫిర్యాదు చేసింది. 
 
పోస్కో చట్టం కింద అతడిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ గణేషానంద స్వామి తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. యువతిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. కాగా ఆమె చేసింది సాహసోపేతమైన చర్యగా కేరళ ముఖ్యమంత్రి అన్నారు. స్వామీజి మాత్రం ఇదంతా ఆమె చేయనేలేదనీ, తనకు పనికిరానిది ఇక ఎందుకని తనే కట్ చేసుకున్నట్లు చెపుతున్నాడు. మరి దర్యాప్తులో ఏది నిజమో తేలాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం