ఫేస్‌బుక్‌లో ఫుడ్ ఆర్డర్... ఇక వెబ్‌సైట్స్.. యాప్‌లతో పనిలేదు...

టెక్నాలజీపరంగా కొత్త పుంతలు తొక్కుతున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సరికొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అనేక రకాల ఆప్షన్లు తీసుకొచ్చిన ఫేస్‌బుక్ ఇపుడు మరోమారు ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది.

Webdunia
శనివారం, 20 మే 2017 (16:39 IST)
టెక్నాలజీపరంగా కొత్త పుంతలు తొక్కుతున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సరికొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అనేక రకాల ఆప్షన్లు తీసుకొచ్చిన ఫేస్‌బుక్ ఇపుడు మరోమారు ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. 
 
ఫేస్‌బుక్ గత కొన్నాళ్లుగా బోల్డన్ని ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెల్సిందే. ఫలితంగా స్మార్ట్‌ఫోన్లలో యాప్‌ల వెల్లువను తగ్గిస్తోంది. వాతావరణం, డిస్కవర్ పీపుల్, సిటీ గైడ్స్, టౌన్‌హాల్.. తదితర వాటిని ప్రారంభించింది. తాజాగా ఆహారం కోసం 'ఆర్డర్ ఫుడ్' ఆప్షన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
 
నిజానికి మనకు ఇష్టమైన ఆహారాన్ని పొందాలంటే సమీపంలో ఉన్న రెస్టారెంట్స్ లేదా హోటల్స్‌కు వెళ్లడం చేయాలి. లేదా ఫోన్‌లో హోమ్ డెలివరీ బుక్ చేసుకోవాలి. ఇకపై రెస్టారెంట్ల వెబ్‌సైట్లు కానీ, యాప్‌లు కానీ ఓపెన్ చేయాల్సిన పనిలేకుండా నేరుగా ఫేస్‌బుక్ ద్వారా ఉన్న చోటు నుంచే ఫుడ్‌ను ఆర్డర్ చేయవచ్చు. 
 
డెలివరీ డాట్ కామ్, స్లైస్ ద్వారా ఫేస్‌బుక్ యూజర్లు ఫుడ్ పికప్, డెలివరీ ఆర్డర్లు చేసుకోవచ్చని ‘టెక్ క్రంచ్’ తెలిపింది. గత డిసెంబరులోనే పేస్‌బుక్ డెలివరీ డాట్ కామ్‌, స్లైస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అది మరికొన్ని రోజుల్లో కార్యరూపం దాల్చనుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments