Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తా ఆశీర్వదించు.. రంగంలోకి దిగుతున్నా... దినకరన్, నేను కూడా వచ్చాక చక్రం... శశి

తమిళ రాజకీయాల్లో గత కొన్నిరోజుల ముందు వరకు రజినీకాంత్ వ్యవహారమే హాట్ టాపిక్ ఉంది. అయితే దినకరన్ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయన గురించి తమిళ రాజకీయాలు కోడై కూస్తున్నాయి. అన్నాడిఎంకే పార్టీకి సారథ్యం వహించేందుకు దినకరన్ వేగంగా పావులు కదుపుతున్నట్లు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (15:05 IST)
తమిళ రాజకీయాల్లో గత కొన్నిరోజుల ముందు వరకు రజినీకాంత్ వ్యవహారమే హాట్ టాపిక్ ఉంది. అయితే దినకరన్ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయన గురించి తమిళ రాజకీయాలు కోడై కూస్తున్నాయి. అన్నాడిఎంకే పార్టీకి సారథ్యం వహించేందుకు దినకరన్ వేగంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్పినట్లుగానే దినకరన్ కూడా అదే చేసేస్తున్నాడు. బయటకు వచ్చిన వెంటనే తమిళ రాజకీయాలపై రహస్యంగా 25 మంది అన్నాడిఎంకే ఎమ్మెల్యేలతో సమావేశమైన దినకరన్ ఆ తరువాత దూకుడు పెంచి అత్త శశికళ ఆశీస్సుల కోసం బెంగుళూరుకు వెళ్ళాడు.
 
జైలులో ఉన్న శశికళను కలిసి అత్తా మీ.. ఆశీస్సులు కావాలి.. మళ్ళీ కథనరంగంలోకి దిగుతున్నా అంటూ చెప్పాడట. మేనల్లుడు కాస్త జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలుసుకున్న శశికళ ఇప్పటికే ఎంతో సంతోషంలో ఉన్నారు. మళ్ళీ అన్నాడిఎంకే పార్టీ తన కనుసన్నలో నడుస్తుందనేది శశికళ ఆలోచన. అనుకున్నట్లుగానే మేనల్లుడు టిటివీ దినకరన్ కూడా అదే వ్యూహంతో ముందుకు వెళుతుండటంతో శశికళ సంతోషానికి పట్టాపగ్గాల్లేకుండా పోయాయట. 
 
ఒక్క ఉదుటన దూకి మళ్ళీ మన చేతుల్లోకి పార్టీని తీసుకో దినకరనా.. అంటూ శశికళ దీవించారట. మొత్తంమీద దినకరన్ ఏ వ్యూహాలతో అన్నాడిఎంకేని మళ్ళీ తనవైపు తిప్పుకుంటారో, ఏ పదవిలో కొనసాగుతారో అన్నది ఆసక్తిగా మారుతోంది. మరోవైపు తను కూడా బెయిల్ పైన విడుదలై వచ్చాక చక్రం పూర్తిగా తిప్పేద్దామని ఆమె చెప్పినట్లు సమాచారం.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments