Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితుడిని పెళ్లి చేసుకుంది.. అల్లుడితో గర్భవతిగా ఇంటికొచ్చింది.. అంతే సజీవదహనం చేసేసారు..

దేశంలో పరువు హత్యల సంఖ్య పెరుగుతూనే వుంది. ఓ దళితుడిని వివాహం చేసుకుందని.. తద్వారా పరువు పోయిందని భావించిన కుటుంబసభ్యులు గర్భిణీ అయిన కుమార్తెను సజీవదహనం చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌ల

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (14:59 IST)
దేశంలో పరువు హత్యల సంఖ్య పెరుగుతూనే వుంది. ఓ దళితుడిని వివాహం చేసుకుందని.. తద్వారా పరువు పోయిందని భావించిన కుటుంబసభ్యులు  గర్భిణీ అయిన కుమార్తెను సజీవదహనం చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో చోటుచేసుతుంది. వివరాల్లోకి వెళితే.. బీజాపూర్ కి చెందిన ముస్లిం యువతి పేరు భాను బేగం. అదే జిల్లాకు చెందిన శరణప్ప అనే దళిత యువకుని ప్రేమలో పడింది. 
 
పెద్దలు అంగీకరించకపోవడంతో వాళ్ళిద్దరూ గోవాకు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో బేగం గర్భం దాల్చింది. తమ ప్రేమను ఇప్పటికైనా ఇరు కుటుంబాలు అర్థం చేసుకుంటారనే ఆశతో.. బేగం తన భర్తతో కలిసి బీజాపూర్ వెళ్ళింది. వారిని చూసి ఆగ్రహించిన బేగం తల్లిదండ్రులు, శరణప్పను వదిలివేయాలని తమ కూతురికి చెప్పారు. అందుకు, ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో శరణప్పపై బేగం కుటుంబసభ్యులు దాడి చేశారు. 
 
వారి బారి నుంచి తప్పించుకుని బయటపడ్డ శరణప్ప, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శరణప్ప పోలీసులతో సంఘటనాస్థలానికి వచ్చేలోపే.. గర్భవతి అనే దయ కూడా లేకుండా.. ఆమె కుటుంబీకులు సజీవదహనం చేశారు. ఈ దారుణానికి పాల్పడ్డ భాను బేగం కుటుంబసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. భాను బేగంను కాపాడేందుకు శరణప్ప చేసిన ఫలితాలు విఫలమయ్యాయి.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం