Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెర్తును షేర్ చేసుకున్న అమ్మాయితో టీటీఈ అసభ్యప్రవర్తన - చెప్పుదెబ్బలు

ఆర్ఏసీ టిక్కెట్‌పై ప్రయాణం చేసేందుకు జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన ఓ అమ్మాయి పట్ల టీటీఈ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ అమ్మాయి అపర కాళిమాతగా మారి టీటీఈని చెప్పుతో కొట్టి.. పోలీసులకు పట్టించింది. దీంతో ఆ

TTE
Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (09:04 IST)
ఆర్ఏసీ టిక్కెట్‌పై ప్రయాణం చేసేందుకు జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన ఓ అమ్మాయి పట్ల టీటీఈ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ అమ్మాయి అపర కాళిమాతగా మారి టీటీఈని చెప్పుతో కొట్టి.. పోలీసులకు పట్టించింది. దీంతో ఆ టీటీఈపై రైల్వే అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఆగ్రాకు చెందిన 18 యేళ్ల ఓ అమ్మాయి ఆర్ఏసీ టికెట్‌పై అలహాబాద్- జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. తెల్లవారుజామున 2 గంటలకు తనిఖీలకు వచ్చిన టీటీఈ నానక్ సింగ్ (50) వద్ద.. తనకు బెర్తు కేటాయించాలని అమ్మాయి కోరింది. బీ3 కోచ్‌లో తనకు కేటాయించిన బెర్తులో పడుకోమని టీటీఈ అమ్మాయిని పంపించాడు. 
 
ఆ తర్వాత అన్ని బోగీల్లో టికెట్ల తనిఖీలు పూర్తయ్యాక తన బెర్తు వద్దకు వచ్చిన టీటీఈ బెర్తులు ఖాళీ లేవని తన బెర్తునే షేర్ చేసుకుందామని అమ్మాయికి చెప్పాడు. అతని మాటలు నమ్మిన ఆ యువతి సమ్మతించింది. ఆ తర్వాత రైలు బోగిలోని లైట్లన్నీ ఆర్పేసిన టీటీఈ నానక్ సింగ్ తన బెర్తును షేర్ చేసుకున్న అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువతి.. టీటీఈని చెప్పుతో కొట్టి... రైల్వే పోలీసు కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేసింది. దీంతో రైలు కాన్పూర్ రైల్వే స్టేషనులో ఆగగానే టీటీఈని పోలీసులు అదుపులోకి తీసుకొని ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అమ్మాయి ఫిర్యాదు మేర రైల్వే ఉన్నతాధికారులు కీచకుడైన టీటీఈ నానక్ సింగ్‌ను సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments