Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు కురుస్తున్నప్పటికీ చలించకుండా యోగి ధ్యానం... వీడియో వైరల్...

వరుణ్
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (16:38 IST)
హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాల్లో ఓ యోగి ధ్యానం చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇపుడు అన్ని రకాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయనే కదా మీ సందేహం. కానీ, ఈ వీడియోకు ప్రత్యేకత ఉంది. ఒకవైపు దట్టంగా మంచు కురుస్తున్నప్పటికీ యోగి మాత్రం ధ్యాననిద్రలో మునిగిపోయాడు. తన శరీరంలో ఏమాత్రం చలనం లేనంతగా ఆయన లీనమైపోయాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు అదంతా ఏఐ సృష్టేనంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అది ఫేక్ కాదని నిజమైన వీడియోనే అని చెబుతున్నారు. ఈ యోగిని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాకు చెందిన సత్యేంద్రనాథ్‌గా గుర్తించారు. 
 
బంజర్‌కు చెందిన సత్యేంద్రనాథ కౌలంటక్ పీఠ్ ఆశ్రమంలో గత 22 యేళ్లుగా యోగా అభ్యసిస్తున్నారు. ఆయన అనుచరులను ఇష్పుత్ర అని పిలుస్తారు. సత్యేంద్రనాథ్ గురువు ఇష్‌నాథ్ హిమాలయ యోగా సంప్రదాయాన్ని అనుసరించేవారు. ఆయన కౌలాంటక్ పీఠానికి అధిపతి కూడా. ఈ పీఠం యోగా, దైవిక అభ్యాసాలకు స్థావరంగా ఉంది. ఇష్పుత్ర భక్తులు ఎనిమిదికి పైగా ప్రదేశాలలో విస్తరించి యోగా, భక్తి అభ్యాసాలను ప్రోత్సహిస్తున్నారు. 
 
సత్యేంద్రనాథ్ గడ్డకట్టిన మంచులో యోగా చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చాలా మందిని ఆకర్షించింది. ఇష్పుత్రలో చిన్నప్పటి నుంచే యోగాభ్యాసం మొదలవుతుంది. హిమపాతం మధ్య యోగాను అభ్యసించడానికి కఠిన శిక్షణ పొందుతారు. సవాలు చేసే వాతావరణ పరిస్థితుల్లో ఇష్పుత్ర ధ్యానానికి సంబంధించిన ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. కాగా, వైరల్ అవుతున్న వీడియోను ఈ నెల ప్రారంభంలో ఇష్పుత్ర శిష్యుడు రాహుల్ షూట్ చేశాడు. భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు సత్యేంద్రనాథ్ యోగాభ్యాసాన్ని, ధ్యానాన్ని ఆయన తరచూ వీడియోలో బంధిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments