Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

సెల్వి
మంగళవారం, 21 మే 2024 (12:01 IST)
సోషల్ మీడియా ఈ రోజుల్లో చాలా మందికి అవమానం, ఆవేదనకు వేదికగా మారింది. ఐడెంటిటీ లేని యూజర్లు నెటిజన్లు ఇతరులను ట్రోల్ చేస్తారు. వారి మానసిక ఆరోగ్యాన్ని పరోక్షంగా ప్రభావితం చేస్తారు. ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న చాలామంది వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు వున్నాయి. 
 
తాజాగా ఒక మహిళా టెక్కీ సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొని ఆత్మహత్యకు పాల్పడింజి. కొన్ని వారాల క్రితం, చెన్నైలోని రెండవ అంతస్తులోని ఫ్లాట్ పైకప్పు నుండి ఎనిమిది నెలల చిన్నారిని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏప్రిల్ 28న ఈ ఘటన జరిగింది. 
 
నాలుగో అంతస్తులో ఉన్న తన తల్లి చేతుల్లోంచి జారిపడి రెండో అంతస్తులోని ఫ్లాట్‌పైన ఆ చిన్నారి ఇరుక్కుపోయింది. పిల్లవాడిని రక్షించిన అపార్ట్‌మెంట్ నివాసితులు.. వీరోచిత ప్రయత్నాలను చాలా మంది ప్రశంసించగా, నెటిజన్లు తల్లిదండ్రులు వారి నిర్లక్ష్యానికి తీవ్రంగా విమర్శించారు. 
 
ఇంట్లో ఇంత చిన్న పాప ఉంటే తల్లిదండ్రులు ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. నెటిజన్లు మాత్రమే కాదు, ఇరుగుపొరుగు వారు మరియు న్యూస్ ఛానెల్‌లు కూడా తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగిందని విమర్శించారు. 
 
అవమానాలు, ట్రోలింగ్‌లను తట్టుకోలేక, బాధితురాలు తన భర్త, బిడ్డతో కలిసి కోయంబత్తూరు సమీపంలోని తన స్వగ్రామం కరమడైకి తిరిగి వెళ్లింది. జరిగిన ఘటన, ట్రోలింగ్‌లు ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆ మహిళ.. ఆదివారం ఇంట్లో కుటుంబ సభ్యులెవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. 
 
కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించారు. వారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments