Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రేమించింది.. ప్రేమికుడితో వివాహం జరిపించిన భర్త.. ఎక్కడ?

భార్య ప్రేమించిందని.. పెళ్ళయ్యాక తెలుసుకున్న భర్త ఏం చేశాడంటే..? భార్యకు ఆమె ప్రేమికుడి పెళ్లికి పెద్దగా నిలిచాడు. ఈ ఘటన ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. మనువాడిన అమ్మాయి.. పెళ్లికి ముందే

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (08:15 IST)
భార్య ప్రేమించిందని.. పెళ్ళయ్యాక తెలుసుకున్న భర్త ఏం చేశాడంటే..? భార్యకు ఆమె ప్రేమికుడి పెళ్లికి పెద్దగా నిలిచాడు. ఈ ఘటన ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. మనువాడిన అమ్మాయి.. పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించిందని.. అతనితో వుండేందుకే ఆమె ఇష్టపడుతుందని తెలుసుకున్న భర్త.. పెద్ద మనసుతో ఆలోచించాడు. దగ్గరుండి వారి పెళ్లి జరిపించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పంపారాకు చెందిన 28 ఏళ్ల బసుదేవ్ టప్పూకు 24 ఏళ్ల మహిళతో ఈ నెల నాలుదో తేదీన అట్టహాసంగా వివాహం జరిగింది. వివాహమైనా ప్రేయసిని వదిలి వుండలేకపోయిన కజిన్.. కొత్త పెళ్లికూతురితో సన్నిహితంగా వుండటాన్ని బంధువులు గమనించి అతనిపై దాడి చేశారు. కానీ పెళ్లి కూతురు అతడే తన ప్రేమికుడని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. 
 
పెద్దల ఒత్తిడి వల్లే ఈ వివాహం చేసుకోవాల్సి వచ్చిందని కొత్త వధువు చెప్పడంతో కొత్త పెళ్లి కొడుకు సీన్లోకి వచ్చాడు. కట్టుకున్న భార్య అలా చెప్పడంతో షాక్ తిన్నప్పటికీ.. కొంతసేపటికే ఓ నిర్ణయానికి వచ్చాడు. తన భార్య ప్రేమించిన వ్యక్తితోనే ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలనుకున్నాడు. భార్య తల్లిదండ్రులు, సోదరులతో ఒప్పంచి.. ప్రేమికుడితో ఘనంగా వివాహం జరిపించాడు. 
 
ఈ వివాహానికి వందలాది మంది హాజరయ్యారు. వధూవరులను దీవించారు. భార్యకు ప్రేమికుడితో వివాహం జరిపించిన టప్పూను బంధువులు, స్నేహితులు ప్రశంసలతో ముంచెత్తారు. భార్యకు ప్రేమికుడితో వివాహం జరిపించకపోయి వుంటే మూడు జీవితాలు నాశనమైపోవుండేవని చెప్పాడు. ప్రస్తుతం ఆమెతో పాటు ముగ్గరం సంతోషంగా వున్నామని తెలిపాడు.
 
టప్పూ నిర్ణయాన్ని ఆతడి తల్లి కూడా స్వాగతించింది. ఇక టప్పూ చేసిన సాయానికి జీవితాతం రుణపడి వుంటామని మాజీ భార్య తెలిపింది. పెళ్లైన రోజే నిజం తెలియడం.. అందుకు టప్పూ అంగీకరించడం పట్ల మాజీ భార్య హర్షం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments