Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై బీచ్ స్టేషనులో ఫ్లాట్‌ఫాంపైకి వచ్చిన విద్యుత్ రైలు

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (13:52 IST)
చెన్నై బీచ్ రైల్వే స్టేషనులో ఒక విద్యుత్ రైలు ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఆ సమయంలో రైలు బోగీలతో పాటు.. ఫ్లాట్‌ఫాంపై ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, ఈ రైలు డ్రైవర్ ధైర్యం చేసి ఫ్లాట్‌ఫాంపై దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం చెన్నై బీచ్ స్టేషన్ ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాంపై జరిగింది. 
 
షెడ్డు నుంచి ఈ స్టేషన్‌కు వచ్చిన ఒక సబర్బన్ రైలు అదుపుతప్పి ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ విద్యుత్ రైలు నియంత్రణ కోల్పోడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, అదృష్టవశాత్తు డ్రైవరు కిందికి దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే, ఈ రైలు మాత్రం పట్టాలు తప్పి ఫ్లాట్‍ఫాంపైకి దూసుకెళ్లి అక్కడ నుంచి ఫ్లాట్‌పాంను చివరి భాగాన్ని ఢీకొట్టింది. 
 
ఈ క్రమంలో రైలు ఫ్లాట్‌ఫాంపైకి ఎక్కింది. దీంతో స్టేషన్ పైకప్పు కూడా దెబ్బతింది. రైలు ప్రమాదానికి గురైన సమయంలో రైలులో ప్రయాణికులు లేరు. ఈ రైలు షెడ్డు నుంచి బీచ్ స్టేషన్‌కు వచ్చింది. పైగా, ఆదివారం కావడంతో రైల్వే స్టేషనులో కూడా ప్రయాణికుల సంఖ్య పెద్దగా లేదు. దీంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. 
 
ఈ ప్రమాదం గురించి దక్షిణ రైల్వే ప్రధాన పీఆర్వో బి.గుహనేశన్ మాట్లాడుతూ, ప్రమాదానికి గురైన రైలు షెడ్డు నుంచి బీస్ స్టేషన్‌ ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాంపైకి వచ్చిందని. అయితే, నియంత్రణ కోల్పోయిన రైలు ఫ్లాట్‌ఫాంను ఢీకొట్టిందని ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదన్నారు. మరోవైపు, ఈ ప్రమాదంపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments