Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైన్యం ముందు లొంగిపోయిన కీలక ఉగ్రవాదులు..

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (11:04 IST)
భారత సైన్యం ముందు కీలక ఉగ్రవాదులు లొంగిపోయారు. భారత సైన్యానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అమలు చేసిన వేగవంతమైన మరియు ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్‌లో హార్డ్కోర్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (స్వతంత్ర) నాయకుడు దృష్టి రాజ్ఖోవా లొంగిపోయారు. మేఘాలయ-అస్సాం-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉగ్రవాదాలు లొంగిపోయినట్లు సైనిక అధికారిక వర్గాలు తెలిపాయి.
 
వేదాంత, యాసిన్ అసోమ్, రోప్జ్యోతి అసోమ్ మరియు మిథున్ అసోమ్ అనే నలుగురు సహచరులతో కలిసి ఆయన లొంగిపోయారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గత తొమ్మిది నెలలుగా భద్రతా దళాలు ఉగ్రవాదులను పట్టుకోవటానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
దిగువ అస్సాంలో ఉగ్రవాద కార్యకలాపాలకు కారణమైన ఉల్ఫా ఉగ్రవాదుల కోసం చాలా కాలంగా గాలిస్తున్నారు. మిలిటెంట్ గ్రూపు సెకండ్ ఇన్ కమాండ్ అయిన రాజ్‌ఖోవా ప్రస్తుతం ఆర్మీ ఇంటెలిజెన్స్ అదుపులో ఉన్నారని, వారిని అస్సాంకు తీసుకువస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments