Webdunia - Bharat's app for daily news and videos

Install App

బందీపొరాలో లష్కరే టాప్ కమాండర్ హతం

ఠాగూర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (12:50 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దాగివున్న ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. తాజాగా లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న వారి కోసం జల్లెడపడుతున్న భద్రతా దళాలను బందీపొరాలో అల్తాఫ్ ఆచూకీ తెలిపింది. శుక్రవారం ఉదయం ఆర్మీ పోలీసు దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. 
 
ఈ క్రమంలో ఉగ్రవాదులను గుర్తించడంతో ఎన్‌కౌంటర్ మొదలైంది. తొలుత ఓ ఉగ్రవాది గాయపడ్డారు. ఆ తర్వాత భద్రతా దళాల్లోని అధికారి బాడీగార్డులకు తూటాలు తాకాయి. ఈ క్రమంలో అల్తాఫ్‌ను మట్టుబెట్టాయి. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ కాశ్మీర్‌లో అడుగుపెట్టిన వేళ ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. 
 
పహల్గాంలో ఉగ్రవాది వెనుక లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కాశ్మీర్‌లో చురుగ్గా పని చేస్తున్న మాడ్యూల్‌ను అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. దీనిలో అత్యధిక మంది విదేశీ ఉగ్రవాదులు, కొందరు మాత్రమే స్థానికులు ఉండేటట్లు చూసుకున్నారు. వీరికి అండగా క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, లాజిస్టిక్స్, దాక్కునేందుకు ప్రదేశాలు ఏర్పాటుచేసేందుకు కొందరు స్థానికులు పనిచేసేవారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments