Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మత్తు.. దివ్యాంగుడైన కుమారుడికి నిప్పంటించిన తండ్రి

కుమారుడినే ఓ తండ్రి సజీవ దహనం చేశాడు. దివ్యాంగుడైన కుమారుడు పడే కష్టాలు చూడలేక తండ్రే ఈ పని చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి సమీప నాసరెద్

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (09:55 IST)
కుమారుడినే ఓ తండ్రి సజీవ దహనం చేశాడు. దివ్యాంగుడైన కుమారుడు పడే కష్టాలు చూడలేక తండ్రే ఈ పని చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి సమీప నాసరెద్‌కు చెందిన ముత్తుకుమార్‌కు భార్య శివగని, దివ్యాంగుడైన కుమారుడు హరిప్రసాద్‌ (14) ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న అతను మంచంపై పడుకున్న హరిప్రసాద్‌కు నిప్పటించడంతో పూర్తిగా కాలిపోయినట్లు నాసరెద్‌ పోలీసులు తెలిపారు.
 
ఆపై ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముత్తుకుమార్‌ను అరెస్ట్ చేశారు. హరిప్రసాద్ చిన్న వయస్సు నుంచే ఎదుగుదల లేకుండా ఉన్నాడని, మాటలు రాలేదని, చెవులు వినిపించవని చెప్పాడన్నారు. కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితం అయ్యాడని, అందువల్ల అతను అవస్థలను చూడలేక ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఈ పని చేసినట్లు ఒప్పుకున్నాడు. 
 
తనకు, తన భార్య అన్న సామువేల్‌ పట్రోజ్‌కు మధ్య గొడవలు ఉన్నాయని, అతనిపై కక్షతో హరిప్రసాద్‌ను చంపి ఆ నేరం సామువేల్‌ పట్రోజ్‌పై వేయాలనుకున్నానని చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments