Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్డ్ కాల్ ఇస్తుంది... ఇంటికి రమ్మంటుంది... ఆ తరువాత?

జల్సాలకు అలవాటుపడిన కొంతమంది స్నేహితులు పక్కదారి పట్టారు. డబ్బులు సంపాదించాలన్న దురుద్దేశంతో పెడదారిని ఎంచుకున్నారు. ముగ్గురు స్నేహితులు చేసిన నిర్వాకం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ముగ్గురు స్నేహితులు కలిసి అసలేం చేశారు.

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (21:52 IST)
జల్సాలకు అలవాటుపడిన కొంతమంది స్నేహితులు పక్కదారి పట్టారు. డబ్బులు సంపాదించాలన్న దురుద్దేశంతో పెడదారిని ఎంచుకున్నారు. ముగ్గురు స్నేహితులు చేసిన నిర్వాకం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ముగ్గురు స్నేహితులు కలిసి అసలేం చేశారు. 
 
గుంటూరు జిల్లాకు సరిగ్గా 60 కిలోమీటర్ల దూరంలో చీరాల ప్రాంతం ఉంది. ఇదే ప్రాంతానికి చెందిన స్రవంతి, ప్రకాష్‌, కిరణ్‌‌లు ముగ్గురూ మంచి స్నేహితులు. జల్సాలకు అలవాటుపడిన వీరు ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడంతో ఏదో ఒకటి చేయాలనుకున్నారు. వీరికి ఒక ఆలోచన తట్టింది. గుంటూరు జిల్లాకు సమీపంలో ఉన్న కొంతమంది ఫోన్ నెంబర్లను తీసుకున్న వీరు వారిని ట్రాప్ చేయడం ప్రారంభించారు. 
 
స్రవంతి తన మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తుంది. వెంటనే ఆ పక్క ఉన్న వ్యక్తి ఎవరి నెంబరో తెలియక ఫోన్ చేస్తాడు. రాంగ్ కాల్ అంటూ అమ్మాయి ఫోన్ పెట్టేస్తుంది. కొద్దిసేపటికి అదే నెంబర్ నుంచి తిరిగి మెసేజ్ వస్తుంది. నీ పేరేమిటి.. ఏం చేస్తుంటావని, అమ్మాయి అడిగితే ఎవరైనా చెప్పకుండా ఉంటారా.
 
ఇలా పరిచయం పెంచుకుని స్రవంతి తన ఇంటికి రమ్మంటుంది. ఇంటికి వచ్చిన యువకులతో చనువుగా ఉంటుంది. ఇంతలో ఇద్దరు కానిస్టేబుళ్ళు ఆ ఇంటి తలుపులు తడతారు. మీరిద్దరూ ఇక్కడ ఏంచేస్తున్నారంటూ బెదిరిస్తారు. దీంతో అక్కడికి వచ్చిన యువకులు భయంతో తమ వద్దనున్న సెల్ ఫోన్, నగదు, చెయిన్లు, ఉంగరాలు ఇచ్చి అక్కడి నుంచి పారిపోతుంటారు. అలా తలుపులు తట్టే పోలీసులు ఎవరో కాదు... స్రవంతి ఫ్రెండ్స్ ప్రకాష్‌, కిరణ్‌‌లే. ఇలా 53 మందికి పైగా యువకులు స్రవంతి చేతిలో మోసపోయారు. కానీ ఇస్మాయిల్ అనే యువకుడు మాత్రం చాకచక్యంగా వ్యవహరించాడు. నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో బండారమంతా బయటపడింది. ఈ ముగ్గురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు కటాకటాల వెనక్కి నెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments